ETV Bharat / sports

CSK X RCB- ధోనీ, విరాటే స్పెషల్ అట్రాక్షన్- బోణీ కొట్టేదెవరో? - CSK vs RCB IPL 2024 Match Preview - CSK VS RCB IPL 2024 MATCH PREVIEW

CSK vs RCB IPL 2024: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఐపీఎల్ సీజన్ 17 మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో చెన్నై- బెంగళూరు జట్టు తలపడున్నాయి. మరి ఈ జట్ల వ్యూహాలేంటి? కెప్టెన్​గా వైదొలిగిన ధోని పాత్ర ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

CSK vs RCB IPL 2024
CSK vs RCB IPL 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 4:56 PM IST

CSK vs RCB IPL 2024: 2024 ఐపీఎల్​లో తొలి మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్​తో సీజన్ 17కు తెర లేవనుంది. రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే కొత్త శకాన్ని ప్రారంభించనుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ జట్టును ముందుకు నడిపిస్తాడన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గాయం కారణంగా న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్ కాన్వే టోర్నీకి దూరం కాగా, అతడి స్థానంలో యంగ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్​ ప్రారంభించే ఛాన్స్ ఉంది. అయితే బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉన్నప్పటికీ భారీ మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన సమీర్ రజ్వీని కూడా బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బౌలింగ్​లోనూ మొయిన్ అలీ జడేజా రూపంలో స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు. శార్దూల్ ఠాకూర్ రెండేళ్ల తర్వాత సీఎస్కేకు ఆడుతున్నాడు. దీపక్ చాహర్ కూడా బ్యాటింగ్ చేసే పేస్ బౌలర్లు. ఈ మ్యాచ్​కు పతిరణ దూరమవ్వడం వల్ల తుషార్ పాండేతో కలిసి సీనియర్లు ఇద్దరూ పేస్ దళాన్ని నడిపించాల్సి ఉంటుంది.

అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ ఈ మ్యాచ్​లో ఇంపాక్ట్ ప్లేయర్​గా బరిలోకి దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే కొన్ని మ్యాచులకు ధోనీ పూర్తిస్థాయిలో ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే సీఎస్కేకు ప్రస్తుతం ఉన్న ఏకైక సీనియర్ వికెట్ కీపర్ ధోనీనే. గాయం కారణంగా కాన్వే కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. యువ వికెట్ కీపర్ ఆరవిల్లేను గత మినీ వేలంలో ఎంపిక చేసింది సీఎస్కే. ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ మాత్రమే చేసి వికెట్ కీపింగ్ యంగ్ ప్లేయర్లకు అప్పగించే ఛాన్స్ కూడా లేకపోలేదు. యువ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు.

మరోవైపు ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్సీబీకి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ సవాల్​గా మారనుంది. ఇక కోహ్లీ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. కోహ్లి- డుప్లెసిస్ జోడీ ఏ జట్టుపైనా సరే దూకుడుగా రాణిస్తారు. కానీ, సీఎస్కేపై ఆర్సీబీ రికార్డు అంత బాగా లేదు. ఐపీఎల్ 2020 సీజన్ నుండి సీఎస్కేతో జరిగిన గత ఏడు మ్యాచ్‌లలో ఆర్సీబీ ఐదుసార్లు ఓడిపోయింది. అదే సమయంలో, గత ఆరు మ్యాచ్‌లలో ఐదు ఓటమిని చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్సీబీ తన జోరును ఏమాత్రం తగ్గించుకుండా మొదటి మ్యాచ్‌లో విజయంతో సీజన్‌ను ప్రారంభించాలని ప్రయత్నిస్తుంది. సీఎస్కే మెరుగైన బౌలింగ్​ కలిగి ఉన్నప్పటికీ, రెండు జట్ల మధ్య గట్టి పోటీనే ఉండబోతుంది

చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్‌జీత్ సింధు, , ప్రశాంత్.సోలంకి, మహేష్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవ్నీష్ రావు అరవెల్లి.

ఆర్సీబీ: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ విశాఖ, ఆకాష్ దీప్, మహ్మద్ సిఐ , రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.

ధోనీ ఫ్యాన్స్​కు షాక్​- CSK కెప్టెన్​గా రుతురాజ్ - Chennai Super Kings New Captain

అందరి దృష్టి ఈ ముగ్గురు కెప్టెన్‌లపైనే- ఏం చేస్తారో మరి? - IPL 2024 Junior Captains

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.