Cricketers Who Never Won T20 World Cup : టెస్టు, వన్డేల్లో, టీ20ల్లో టీం ఇండియా జట్టు ప్రదర్శన కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిలకడైన ఫామ్‌తో ద్వైపాక్షిత టోర్నీలతోపాటు అంతర్జాతీయ సిరీస్‌లలో ఎన్నో విజయాలు అందుకుంది టీం ఇండియా. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో ఫస్ట్ మ్యాచ్ నుంచి ఫైనల్స్ వరకు రాణించిన భారత జట్టు తృటిలో కప్పును కోల్పోయింది. కానీ, ఆ తర్వాత జరిగిన చాలా మ్యాచ్‌లలో సత్తా చాటారు భారత క్రికెట్ ప్లేయర్లు.ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ సిరీస్‌పై అందరి దృష్టి పడింది.
టీ20 ప్రపంచకప్ ఫస్ట్ ఛాంపియన్ అయిన భారత్ ఈ ఏడాది మళ్లీ ఛాంపియన్‌గా ఆవిర్భవించాలని కృతనిశ్చయం పెట్టుకుంది. కాగా, తమ కెరీర్లో నాలుగైదు సార్లు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడినా జట్టుకు ఆ ట్రోఫీ అందించలేకపోయారు ఐదుగురు క్రికెటర్లు. తమ ఆటతీరుతో టీమ్ఇండియాపై ప్రత్యేక ముద్రవేసిన ఆ క్రికెటర్లకు వ్యక్తిగతంగా ఇదో లోటుగా మారింది.
విరాట్ కోహ్లీ
మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన టీ20 సిరీసుల్లో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది టీమ్ఇండియా. 2011 వన్డే ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన విరాట్ తన జట్టుకు టీ20 కప్పును మాత్రం అందజేయలేకపోయాడు. 2012, 2014, 2016, 2021, 2022ల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడాడు విరాట్. 2021లో విరాట్ కెప్టెన్‌గా బాధ్యతలు వహించాడు. కానీ, ఒక్కసారి కూడా ఫైనల్స్ విజేత కాలేకపోయింది ఇండియా. ఇది విరాట్ కెరీర్లో లోటుగా నిలిచిపోయింది.
సురేశ్ రైనా
టీ20ల్లో మొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సురేశ్ రైనా కెరీర్లోనూ ఒక్కసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవలేకపోయింది టీమ్ ఇండియా. 2009, 2010, 2012, 2014, 2016ల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆడాడు రైనా. ఈ అన్ని సిరీస్‌లలో రైనా అద్భుతంగా రాణించినా ఇండియా మాత్రం టీ20 వరల్డ్ కప్ విజేత కాలేకపోయింది.
రవిచంద్రన్ అశ్విన్
స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్లో ఒక్కసారి కూడా టీ20 ట్రోఫీ గెలుచుకోలేకపోయాడు. 2012, 2014, 2016, 2021, 2022ల్లో జరిగిన వరల్డ్ కప్ టీ20ల్లో రవిచంద్రన్ అశ్విన్ ఆడాడు. తన స్పిన్ మంత్రంతో జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన అశ్విన్ కెరీర్లో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. ఐతే టీ20 వరల్డ్ కప్ సాధించలేకపోవడం మాత్రం అశ్విన్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది.
రవీంద్ర జడేజా
తన ఆల్ రౌండ్ ట్యాలెంట్‌తో టీమ్ఇండియా జట్టులో ప్రత్యేక చాటుకున్న రవీంద్ర జడేజా కెరీర్లో కూడా టీ20 వరల్డ్ కప్ లోటుగా మిగిలిపోయింది. 2009, 2010, 2012, 2016, 2021 ఏడాదిల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడాడు జడేజా. మొత్తం ఐదుసార్లు టీమ్‌లో చోటు సంపాదించుకున్నా, ఏ ఒక్కసారి కూడా భారత్ విజేత కాలేకపోయింది.
మహమ్మద్ షమీ
టీమ్ఇండియా నమ్మదగ్గ బౌలర్లలో మహమ్మద్ షమీ ఒకరు. మొత్తం నాలుగుసార్లు భారత్ తరపున టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడినప్పటికీ ఒక్కసారి కూడా కప్ గెలవకపోవడం షమీ కెరీర్లోనూ ఈ లోటు ఉంది. 2014, 2016, 2021, 2022 ఏడాదిల్లో జరిగిన నాలుగు టోర్నీల్లోనూ మహమ్మద్ షమీ టీమ్ఇండియా సభ్యుడిగా ఉన్నా టీమ్ఇండియా కప్ గెలవలేకపోయింది.
ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్ - కేన్ మామనే టాప్ - రోహిత్, కోహ్లీ పొజిషన్ ఏంటంటే ?
గ్రీన్, డస్ట్ పిచ్‌లు అంటే ఏంటి?- టెస్టు క్రికెట్లో వీటి ఇంపార్టెన్స్ తెలుసా?