ETV Bharat / sports

దారుణం - స్టార్​ క్రికెటర్​ను గన్​తో బెదిరించి దాడి! - Cricketer Fabian Allen attacked

Cricketer Fabian Allen attacked : స్టార్ క్రికెటర్‌ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై కొందరు దుండగులు దాడి చేసేందుకు యత్నించారు. గన్‌తో బెదిరించి విలువైన వస్తువులను దోచుకుని వెళ్లారు. ఆ వివరాలు

దారుణం - స్టార్​ క్రికెటర్​ను గన్​తో బెదిరించి దాడి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 9:29 AM IST

Updated : Feb 6, 2024, 11:03 AM IST

Cricketer Fabian Allen attacked : వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌ ఫాబియన్ అలెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్‌‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడిపై కొందరు దుండగులు దాడి చేసేందుకు యత్నించారు. గన్‌తో బెదిరించి అతడి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకుని వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దక్షిణాఫ్రికాలోని శాండ్టన్‌ సన్ హోటల్ దగ్గర ఈ దారుణమైన ఘటన చోటు చేసుకున్నట్లు ఇంగ్లీష్ కథనాల ద్వారా తెలిసింది.

ఫాబియన్​కు సంబంధించిన ఫోన్, బ్యాగ్‌తో పాటు మరికొన్ని వ్యక్తిగత వస్తువులను దుండగులు దోచుకుని తీసుకెళ్లినట్లు కథనాల్లో రాసి ఉంది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారట. అయితే ఫాబియన్ అలెన్‌కు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. కానీ ఈ ఘటన వల్ల సౌతాఫ్రికా ప్లేయర్స్​ భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఈ సంఘటనపై పార్ల్ రాయల్స్ జట్టు ఇంకా స్పందించనేలేదు. మరోవైపు సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) నిర్వాహకులు దీనిపై ఆరా తీస్తున్నారు. పోలీసుల నుంచి దర్యాప్తునకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

మరింత నష్టం కలిగే అవకాశాలు : ఇకపోతే అసలే సౌతాప్రికా క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ఇలాంటి సమయంలో SA20 లీగ్ కాస్త ఊరట ఇచ్చింది. గతేడాది ప్రారంభమైన ఈ లీగ్ రెండో సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. ప్లేఆఫ్స్‌ దశకు లీగ్​ చేరుకుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్ల భద్రత విషయంలో సౌతాఫ్రికా బోర్డు వైఫల్యం చెందితే మళ్లీ ఆ బోర్డుకు తీవ్ర నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కాగా, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది పార్ల్ రాయల్స్. బుధవారం(ఫిబ్రవరి 7) ఎలిమినేటర్ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో పోటిపడనుంది. ఈ సీజన్​లో ఫాబియన్ అలెన్‌ ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. ఇంకా 38 పరుగులు మాత్రమే చేశాడు. నేడు(ఫిబ్రవరి 6) క్వాలిఫయిర్-1లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ - డర్బన్ సూపర్ జెయింట్స్​తో తలపడనుంది.

మూడో టెస్ట్​కు కోహ్లీ - రాహుల్ ద్రవిడ్​​ ఇలా అన్నాడేంటి?

బీసీసీఐ షాకింగ్ డెసిషన్- మూడో టెస్టుకు బుమ్రాకు దూరం!- ఎందుకంటే?

Last Updated : Feb 6, 2024, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.