ETV Bharat / sports

ఇషాన్​పై బీసీసీఐ గరం- రంజీల్లో ఆడాల్సిందేనని నోటీసులు! - Ishan Kishan Come Back

BCCI Warns Ishan Kishan: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​ పట్ల బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీలో ఆడకుండా నేరుగా ఐపీఎల్​కు ప్రిపేర్ అవుతున్న పలువురు క్రికెటర్లకు బీసీసీఐ నోటీసులు ఇవ్వనుందట.

BCCI Warns Ishan Kishan
BCCI Warns Ishan Kishan
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 4:16 PM IST

Updated : Feb 12, 2024, 4:29 PM IST

BCCI Warns Ishan Kishan: టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్​ ప్రవర్తన పట్ల బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ జట్టుకు దూరమైన ఇషాన్ కనీసం రంజీల్లో కూడా ఆడకుండా, ఏకంగా ఐపీఎల్​ కోసం సన్నద్దమవడం బోర్డు మేనేజ్​మెంట్​కు నచ్చలేదని సమాచారం. ఇషాన్​తోపాటు దేశవాళీలో రెడ్​బాల్ క్రికెట్ (టెస్టు) ఆడేందుకు నిరాకరిస్తున్న ప్లేయర్లకు నోటీసులు ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యిందట.

టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించని ప్లేయర్లంతా వారి వారి సొంత రాష్ట్రాలకు రంజీల్లో ప్రాతినిధ్యం వహించాల్సిందేనని బీసీసీఐ పేర్కొంది. పూర్తి ఫిట్​గా లేని, గాయాల నుంచి ఎన్​సీఏ (NCA)లో కోలుకుంటున్న వారికి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. జనవరి నుంచే కొందరు ఆటగాళ్లు ఐపీఎల్​ కోసం ప్రిపేర్ అవ్వడం వల్ల బీసీసీఐ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.

అయితే టీమ్ఇండియాకు దూరమైన ఇషాన్ కిషన్, ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ పట్ల ఆసక్తి చూపట్లేదు. అతడు ఇటీవల మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. బరోడా రిలయన్స్ స్టేడియంలో హార్దిక్ పాండ్యతో కలిసి నెట్స్​లో శ్రమిస్తున్నాడు. దీంతో అతడు రంజీల్లో ఆడకుండా డైరెక్ట్​గా ఐపీఎల్​లో బరిలో దిగడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీలో ఝార్ఖండ్​కు ఒకే మ్యాచ్ మిగిలి ఉంది. ఫిబ్రవరి 16నుంచి రాజస్థాన్​తో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇషాన్ ఇప్పటికీ తన పేరు జట్టుతో నమోదు చేసుకోలేదు.

అయితే రీసెంట్​గా ఇషాన్ కమ్​బ్యాక్ గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్​ను అడగ్గా 'ఇషాన్ కిషన్​ డొమెస్టిక్ టోర్నీలో ఆడడం స్టార్ట్ చేయాలి. అప్పుడే అతడు సెలక్షన్​లో ఛాయిస్​గా ఉంటాడు. ఇప్పటికీ సెలక్షన్ కమిటీ, మేనేజ్​మెంట్ ఇషాన్​తో టచ్​లోనే ఉంది' అని అన్నాడు. రాహుల్ ఈ కామెంట్ చేసిన వారంలోపే ఇషాన్ మళ్లీ నెట్స్​లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. అయితే గతేడాది సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఇషాన్, టెస్టు సిరీస్​కు ముందు బీసీసీఐని విశ్రాంతి కోరాడు. మానసిక ఒత్తిడి కారణంగా రెస్ట్ కావాలన్న ఇషాన్ అభ్యర్ధనను మేనేజ్​మెంట్ అంగీకరించి అతడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఇషాన్ ఆ పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చాడు.

బీసీసీఐ పట్ల ఇషాన్ అసంతృప్తి- ఆ ప్లేయర్​ను సెలక్ట్ చేయడమే కారణం!

గాడిలో పడ్డ ఇషాన్!- ప్రాక్టీస్ షురూ- ద్రవిడ్ మాటలు వర్కౌటైనట్లే?

Last Updated : Feb 12, 2024, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.