ETV Bharat / sports

భారత్​ x ఇంగ్లాండ్​ - ఆ నాలుగు రికార్డులపై అశ్విన్ ఫోకస్​ !

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 4:09 PM IST

Ashwin Ind Vs Eng 2nd Test : విశాఖ వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న రెండో టెస్టు కోసం టీమ్ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో టీమ్​ఇండియా వెటరన్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ పలు రికార్డులను బ్రేక్​ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతకీ అవేంటంటే ?

Ashwin Ind Vs Eng 2nd Test
Ashwin Ind Vs Eng 2nd Test

Ashwin Ind Vs Eng 2nd Test : హైదరాబాద్​ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవి చూసిన రోహిత్ సేన ఇప్పుడు రెండు టెస్టును కైవసం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. విశాఖ వేదికగా ఫిబ్రవరి 2న ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌కు సిద్ధమవుతోంది. అయితే పలువురు క్రికెటర్లు ఈ వేదికపై అనేక రికార్డులను తమ ఖాతోలో వేసుకోవాలని కసితో ఉన్నారు. అందులో టీమ్​ఇండియా స్టార్‌ స్పిన్నర​ రవిచంద్రన్‌ ఒకరు. తొలి టెస్టులో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్​ పేసర్​ విశాఖ వేదికగా మరిన్ని రికార్డులను బ్రేక్​ చేసేందుకు రెడీగా ఉన్నాడు. అవేంటంటే

టెస్టుల్లో ఇప్పటివరకు ఇంగ్లాండ్​పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్​గా సీనియర్ ప్లేయర్​ భగవత్‌ చంద్రశేఖర్‌ టాప్​ పొజిషన్​లో ఉన్నారు. ఈయన ఇంగ్లాండ్​తో ఆడిన 23 మ్యాచుల్లో 95 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇప్పుడు జరగనున్న రెండో టెస్ట్‌లో అశ్విన్‌ (20 టెస్ట్‌ల్లో 93 వికెట్లు) మరో 3 వికెట్లు తీస్తే ఇంగ్లాండ్​పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌ రికార్డును తన పేరిట రాసుకుంటాడు.

భారత్‌-ఇంగ్లాండ్​ మధ్య జరిగిన టెస్ట్‌ల్లో ఇప్పటివరకు ఏ భారత బౌలర్‌ కూడా 100 వికెట్లు తీసిన రికార్డును నమోదు చేయలేదు. దీంతో ఈ అచీవ్​మెంట్​పై కన్నేశాడు అశ్విన్​. ఈ రెండో టెస్టులో అతడు మరో 7 వికెట్లు తీస్తే ఇంగ్లాండ్​పై 100 వికెట్లు సాధించిన తొలి భారత బౌలర్‌గా చరిత్రకెక్కుతాడు. అయితే ఇరు జట్ల మధ్య టెస్ట్‌ల్లో ఇప్పటివరకు జేమ్స్‌ ఆండర్సన్‌ మాత్రమే 139 వికెట్లు తీశాడు.

ఇక అశ్విన్‌ భారత గడ్డపై ఇప్పటివరకు 56 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడి 343 వికెట్లు పడగొట్టాడు. అయితే రానున్న రెండో టెస్ట్‌లో మరో 8 వికెట్లు తీస్తే సొంత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. ఇప్పటికే ఆ రికార్డులో సీనియర్​ ప్లేయర్​ పేరు అనిల్‌ కుంబ్లే 350 వికెట్లతో టాప్​ లిస్ట్​లో ఉంది.

అశ్విన్​ తన కెరీర్‌లో ఇప్పటివరకు 34 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించాడు. అయితే రానున్న రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల రికార్డును సాధిస్తే, మాజీ క్రికెటర్​ అనిల్‌ కుంబ్లే పేరిట ఉన్న రికార్డు (భారత్‌ తరఫున అత్యధిక ఐదు వికెట్లు తీసిన ప్లేయర్​) రికార్డును బ్రేక్​ చేస్తాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.