Archery World Cup 2024 : ఆర్చరీ ప్రపంచకప్ 2024లో భారత ఆర్చర్లు తమ సత్తా చాటారు. తాజాగా జరిగిన ఫైనల్స్‌లో పోటాపోటీగా ఆడి భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు అందించారు. శనివారం జరిగిన కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో వరల్డ్‌కప్ స్టేజ్- 1 ఫైనల్‌లో భారత మహిళల టీమ్ జ్యోతి సురేఖ, అదితి స్వామి, ప్రర్ణీత్ కౌర్‌లతో కూడిన జట్టు ప్రత్యర్థి ఇటలీ టీమ్‌పై 236-225 తేడాతో నెగ్గి గోల్డ్ మెడల్ పట్టేశారు.
ముఖ్యంగా తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఈ ఫైనల్‌లో తనదైన శైలిలో ఆడి సత్తా చాటింది. మిక్స్‌డ్ డబుల్ ఈవెంట్ మహిళా జట్టు స్వర్ణాలు గెలవడంలో జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది.
ఇక కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్‌లో 158-157 తేడాతో ఎస్తోనియా జట్టుపై గెలుపు సాధించింది. పురుషుల టీమ్ ఈవెంట్‌లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్, ప్రథమేశ్‌తో కూడిన ఇండియన్ టీమ్ నెదర్లాండ్‌కు చెందిన మైక్ స్కాలోసెర్, సిల్ పటెర్, స్టెఫ్ విలిమ్స్ టీమ్‌పై 238-231 తేడాతో అలవోకగా చిత్తు చేశారు. దీంతో స్వర్ణం ఆ జట్టు సొంతమైంది.
ఇదిలా ఉండగా, మహిళల జట్టు విభాగంలో ఇటలీకి చెందిన టీమ్‌పై మన భారత్ అమ్మాయిలు అద్భుత విజయాన్ని సాధించారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఫైనల్స్‌లో స్వర్ణం సాధించారు. వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌తో కూడిన ఈ టీమ్‌ఇండియా జట్టు 236-225 తేడాతో ఇటలీ ఆర్చర్లు మార్సెల్లా టినిలి, ఐరెనె ఫ్రాంచిని, ఎలీసా రోనెర్ను చిత్తు చేసి ఘన విజయాన్ని సాధించడం విశేషం. దీంతో ఇటలీ ప్లేయర్లు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది.
మరోవైపు రికర్వ్ మిక్స్‌డ్ టీమ్‌లో అంకిత బాకత్- బొమ్మదేవర ధీరజ్ జోడీ మెక్సికతో తలపడనుంది. మరో విశేషం ఏంటంటే మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్టార్ ఆర్చర్ దీపిక కుమారి సెమీ ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
-
IMPECABLE. 😮💨🇮🇳
— World Archery (@worldarchery) April 27, 2024
First win of the season for team India at the @ArcheryWorldCup stage 1 final in Shanghai.#ArcheryWorld #Archery @india_archery pic.twitter.com/xMzFtrDPeI
Archery World Cup 2023 : ఆర్చరీలో పసిడి ధమాకా.. స్వర్ణాన్ని ముద్దాడిన తెలుగు తేజాలు!
వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్ 2023లో శ్రీకాకుళం క్రీడాకారుల హవా - బంగారు, కాంస్య పతకాలు కైవసం