Archery World Cup 2024: ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో భారత్ మరోసారి సత్తా చాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు, పురుషులు, మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లలో ఇప్పటికే బంగారు పతకాలతో మెరిసిన భారత్ తాజాగా మరో స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే భారత కాంపౌండ్ ఆర్చర్లు మొత్తం అయిదు పతకాలు గెలవగా తాజాగా మెన్స్ రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన బృందం స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో ఈ బృందం దక్షిణ కొరియా జట్టును ఓడించింది.
ఒలింపిక్ ఛాంపియన్‌లుగా నిలిచిన దక్షిణ కొరియాను 5-1తో మట్టికరిపించిన ధీరజ్ నేతృత్వంలోని బృందం అంతర్జాతీయ వేదికపై భారత సత్తాను చాటింది. ఈ స్వర్ణ పతకాన్ని సాధించడం భారత ఆర్చరీలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలుస్తుందని ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. దక్షిణ కొరియాపై భారత్ 57-57, 57-55, 55-53తో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్ ఇప్పటివరకూ అయిదు స్వర్ణ పతకాలు ఒక రజత పతకం సాధించింది. మాజీ ప్రపంచ నంబర్ 1 దీపికా కుమారి కూడా స్వర్ణంపై దృష్టి పెట్టింది. ఇవాళ మహిళల రికర్వ్ సెమీఫైనల్‌లో కొరియా ప్రత్యర్థితో దీపికా కుమారి తలపడనుంది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ కాంస్య పతకం కోసం పోరాడనుంది.
మూడు పతకాలతో తెలుగమ్మాయి
ఇదే పోటీల్లో శనివారం జరిగిన ఫైనల్స్‌లో కూడా భారత ఆర్చర్ల బృందం సత్తాచాటింది. మహిళల సింగిల్స్ సహా మహిళలు పురుషులు, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాల పట్టేశారు. షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం పసిడిని ఒడిసిపట్టింది. మెక్సికోకు చెందిన ఆండ్రియా బెకెర్రాతో జరిగిన మహిళల వ్యక్తిగత ఈవెంట్లో జ్యోతిసురేఖ హోరాహోరీ పోరాడి పసిడిని సాధించింది. indian archery gold medals
ఇక ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్‌తో కలిసి సురేఖ వెన్నం మహిళల టీమ్ ఈవెంట్లో 236-225 పాయింట్ల తేడాతో పసిడి పతకం కైవసం గెలుపొందింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి 158-157పాయింట్ల తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించింది. ఇక పురుషుల టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ప్రియాన్ష్ , ప్రీతమేష్తో కూడిన బృందం నెదర్లాండ్స్ జట్టుపై 238-231తేడాతో గెలిచి బంగారు పతకం గెలిచింది.
సురేఖ, అభిషేక్ జోడీ అదుర్స్- 'భారత్' ఖాతాలో మూడు పసిడి పతకాలు - Archery World Cup 2024
Asian Games 2023 India Gold Medal : తెలుగమ్మాయికి బంగారు పతకం.. భారత అథ్లెట్లు తగ్గేదేలే!