ETV Bharat / spiritual

మీ ఇంట్లో కనక వర్షం కురవాలా? - వేంకటేశ్వర స్వామిని ఈ రోజున దర్శించుకుంటే చాలు! - Which Day is Good to Visit Tirumala

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 20, 2024, 6:28 PM IST

Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. అయితే తిరుమల శ్రీవారిని ఈ రోజున దర్శించుకుంటే ధనలాభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Which Day is Good to Visit Tirumala
Which Day is Good to Visit Tirumala (ETV Bharat)

Which Day is Good to Visit Tirumala: తిరుమల ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తుంటారు. కాలినడకన స్వామి వారిని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటారు. వారాలతో, వర్జ్యాలతో సంబంధం లేకుండా స్వామివారిని కనులారా వీక్షిస్తుంటారు. అయితే ఆ ఏడుకొండల వాడిని ఏ రోజు దర్శిస్తే మంచిదో మీకు తెలుసా? వారంలో ఏఏ రోజున దర్శించుకుంటే ఏఏ ఫలితాలు లభిస్తాయో పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఈ రోజున స్వామి వారిని దర్శించుకోవాలని చెబుతున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తిరుమల శ్రీవారిని వారంలో ఒక్కొక్కరోజు దర్శనం చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ ఫలితాలు ఏంటంటే..

ఆదివారం: ఈరోజు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. రాజకీయాల్లో పురోగతి లభిస్తుంది. తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తులు తొందరగా సంక్రమిస్తాయని చెబుతున్నారు.

సోమవారం: తిరుమల క్షేత్రంలో స్వామి వారిని సోమవారం దర్శించుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే ఎంత తీవ్రమైన అనారోగ్య సమస్యలైనా ఇట్టే తగ్గిపోతాయని చెబుతున్నారు.

మంగళవారం: ఆ ఏడుకొండల వాడిని మంగళవారం దర్శించుకుంటే రుణ బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్నా మంగళవారం దర్శనం చేసుకోవచ్చని చెబుతున్నారు.

కోరికలు తీరాలని వేంకటేశ్వర స్వామికి "ముడుపు" కడుతున్నారా? - ఇలా కడితేనే 100% రిజల్ట్!

బుధవారం: స్వామి వారిని ఈరోజున దర్శిస్తే సరస్వతీ కటాక్షం కలుగుతుందని.. చిన్నపిల్లలకు మంచి విద్య లభిస్తుందని అంటున్నారు. చదువులో వెనుకబడిన పిల్లలు బుధవారం రోజున స్వామిని దర్శించుకుంటే చదువులో రాణిస్తారని అంటున్నారు.

గురువారం: ఈరోజున ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటే వివాహ సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. వయసు ముదిరిపోతున్నా.. వచ్చిన సంబంధాలన్నీ క్యాన్సిల్​ అవుతున్నా.. గురువారం రోజు దర్శించుకుంటే మంచిదని వివరిస్తున్నారు. అలాగే పెళ్లై ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేని వారు కూడా ఈరోజున దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చెబుతున్నారు.

శుక్రవారం : ఈరోజున ఆ ఆపదమొక్కులవాడిని దర్శించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని.. ఇంట్లో కనకవర్షం కురుస్తుందని అంటున్నారు.

శనివారం: ఈ రోజున వడ్డీకాసుల వాడిని దర్శించుకుంటే నవగ్రహ దోషాలు తొలిగిపోతాయని అంటున్నారు. అలాగే కలి బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.

విద్యార్థులకు జ్ఞానప్రదాత హయగ్రీవుడు- సోమవారం ఇలా పూజిస్తే విద్యాబుద్ధులు పక్కా!

అయితే పైన చెప్పిన ఫలితాలు లభించాలంటే ముందుగా ఈ నియమాలు పాటించాలంటున్నారు మాచిరాజు కిరణ్​ కుమార్​. అవి ఏంటంటే..

  • స్వామి వారిని దర్శించుకున్న ఫలితం కలగాలంటే ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి వరాహ స్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలని చెబుతున్నారు.
  • వరాహ స్వామి వద్ద పటిక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టమని సలహా ఇస్తున్నారు.
  • పవిత్రమైన తిరుమల కొండపై చెప్పులు వేసుకుని నడవరాదని చెబుతున్నారు.
  • అలాగే మహిళలలు కొండ మీద పూల ధరించకూడదని సూచిస్తున్నారు.
  • అంతేకాకుండా దైవ దర్శనానికి వెళ్లినప్పుడు చిన్న పిల్లలను ధూషించడం, కొట్టడం, కోపగించుకోవడం లాంటివి చేయొద్దని చెబుతున్నారు. ఈ నియామాలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుంటేనే విశేషమైన ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.

NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఎంతో కష్టపడి తిరుమల కొండపైకి వెళ్లి, ఈ తప్పులు చేస్తున్నారా? - స్వామి వారి అనుగ్రహం లభించదు!

సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే వినాయక క్షేత్రం- ఎక్కడుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.