What to Do Dead Person Belongings as per Vastu: ఈ భూమ్మీద మనిషి ప్రాణంతో సహా ఏది శాశ్వతం కాదు.. సమస్త జీవరాశులూ ఏదో ఒక రోజు మరణించాల్సిందే. అయితే.. వ్యక్తి మరణానంతరం వారి జ్ఞాపకాలతోపాటు వారికి సంబంధించిన వస్తువులూ మనతో ఉంటాయి. మరి, వాటిని ఏం చేయాలి? ఇతరులు ఉపయోగించాలా? వద్దా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చూద్దాం..
చనిపోయిన వ్యక్తి నగలు ధరించవచ్చా?
వాస్తు ప్రకారం.. చనిపోయిన వ్యక్తి ఆభరణాలను ఇతరులు ధరించకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ నగలను స్మారక చిహ్నాలుగా లేదా సెంటిమెంట్ కోసం ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు. అలా కాకుండా వాటిని ధరించడం వల్ల.. మరణించిన వ్యక్తి ఆత్మను ఆకర్షించినట్లు అవుతుందట. ఒకవేళ మరణానికి ముందు వారి ఆభరణాలను మీకు బహుమతిగా ఇచ్చి ఉంటే, వాటిని ధరించవచ్చని చెబుతున్నారు. మరణించిన తర్వాత ఆభరణాలు అందితే.. వాటిని కరిగించి కొత్త డిజైన్ చేయించిన తర్వాత ధరించవచ్చని చెబుతున్నారు.
కాంపౌండ్ వాల్‌ను గుండ్రంగా నిర్మించుకోవచ్చా? వాస్తు ఏం చెబుతుంది! - Vastu Rules For Home
చనిపోయిన వ్యక్తి వస్త్రాలు ఏం చేయాలి?
చనిపోయిన వారి వస్త్రాలను గుర్తుగా తమ వద్ద ఉంచుకుంటారు కొందరు. వాటిని ధరించి వారు తమతోపాటే ఉన్నట్టు భావిస్తారు. అయితే.. వాస్తు ప్రకారం పొరపాటున కూడా చనిపోయిన వ్యక్తి దుస్తులను ఇతరులు ధరించకూడదని అంటున్నారు. ఎందుకంటే ఆ బట్టలు వారి ఆత్మలను ఆకర్షిస్తాయని.. ప్రత్యేకించి మరణించిన వ్యక్తి దుస్తులను కుటుంబ సభ్యులు ధరిస్తే అది చెడు ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు.
అలా చేస్తే.. చనిపోయిన వ్యక్తి ఆత్మ అనుబంధాల బంధాలను తెంచుకోలేక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుందని తెలుపుతున్నారు. మరణించిన వారి వస్త్రాలు ధరిస్తే పితృ దోషం బారిన పడవచ్చని కూడా అంటున్నారు. అందువల్ల చనిపోయిన వ్యక్తికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఈ దుస్తులను వాడకూడదని.. తెలియని వ్యక్తులకు వాటిని బహుమతిగా ఇవ్వడం లేదా దానం చేయడం లాంటివి చేయవచ్చని అంటున్నారు.
ఇతర వస్తువులను ఏం చేయాలి?
మరణించిన వ్యక్తికి సంబంధించిన ఇతర వస్తువులను జ్ఞాపకంగా ఉంచుకోవచ్చు లేదా ఎవరికైనా విరాళంగా ఇవ్వవచ్చని పండితులు చెబుతున్నారు. అయితే పొరపాటున కూడా మరణించిన వ్యక్తి వాచ్‌ను ఇతరులు ధరించకూడదట. అలా చేయడం కూడా పితృ దోషానికి కారణం కావచ్చంట. దువ్వెన, షేవింగ్ కిట్, రోజువారీ వస్తువులు కూడా దానం చేయడం లేదా నాశనం చేయాలంటున్నారు. వీటితోపాటు చనిపోయిన వారి జాతకాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని.. దాన్ని ఆలయంలో ఉంచడం లేదా పవిత్ర నదిలో పడేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు విముక్తి లభిస్తుందట.
వాస్తు - పూజ గదిలో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! - లేకపోతే కష్టాలు తప్పవు! - vastu tips for home