ETV Bharat / spiritual

వాస్తుప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే - అదృష్టం మీ వెంట ఉన్నట్లే! - Good Luck plants to Attract Wealth

Good Luck Plants : అదృష్టం, సంపదను తీసుకొచ్చే మొక్కలు అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది మనీ ప్లాంట్. ఆ తర్వాత వెదురు గుర్తొస్తుంది. అయితే వాస్తు ప్రకారం ఇవి మాత్రమే కాదు మరికొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. అవి మీ ఇంట్లో పెంచుకున్నట్లయితే నెగటివ్ ఎనర్జీ పోయి అష్టైశ్వర్యాలు పొందవచ్చంటున్నారు వాస్తునిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Good Luck Plants
Plants
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 1:39 PM IST

Lucky Plants for Home As Per Vastu : మొక్కలు పెంచడమంటే చాలా మందికి ఇష్టం. ఖాళీ ప్లేస్​ దొరికితే చాలు మొక్కలతో నింపేస్తారు. ప్రస్తుతం టెర్రస్ గార్డెన్‌ ట్రెండ్​ కూడా నడుస్తోంది. దీంతో రకరకాల మొక్కలను ఇష్టంగా నాటుతున్నారు. ఇంటి బయట సరే.. మరి ఇంట్లో పెంచే మొక్కల గురించి తెలుసా? అవే లక్కీ ప్లాంట్స్. ఈ మొక్కలు చాలా అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. వాస్తు ప్రకారం ఈ మొక్కల ఇంట్లో పెంచడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉండటంతో పాటు కొన్ని దుష్ట శక్తులు దరిచేరవని, అలాగే డబ్బు, అదృష్టం కలిసి వస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ మొక్కలేంటో ఈ స్టోరీలో చూద్దాం..

వెదురు : వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను లక్కీ ప్లాంట్ అంటారు. ఇది నిజమైన వెదురు మొక్క కాకున్నా దాని లాగా పొడవుగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో మట్టి అవసరం లేకుండా నీళ్లలోనే పెరుగుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే ధనం, సౌభాగ్యం, అదృష్టం లభిస్తాయని నమ్ముతారు. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది.

స్నేక్ ప్లాంట్ : వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఇండోర్ ప్లాంట్​ను పెంచుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. దీనినే మదర్​ ఇన్​ లా ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఈ మొక్కలు పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతేకాదు ఇది గాలిలో ఉండే విషపూరిత వాయువుల్ని పీల్చుకుని గాలిని శుభ్రంగా మారుస్తుంది.

కుబేర మొక్క : దీనినే జేడ్ ప్లాంట్, క్రాసులా మొక్క అని అంటారు. చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఈ మొక్కను నాటమని సలహా ఇస్తున్నారు. ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివిటీని పెంచుతుందని.. తద్వారా శ్రేయస్సు, సంపద పొందవచ్చంటున్నారు.

ఈ మొక్కలు మన మనసు మార్చేస్తాయట!

రబ్బరు మొక్క : ఈ మొక్కను సహజ సిద్ధ ఎయిర్​ ప్యూరిఫయర్ అని పిలుస్తారు. ఎందుకంటే దీనికి గాలిని శుద్ధి చేయడంతో పాటూ శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా చేసే గుణం ఉంది. ఈ మొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో గుండ్రంగా నాణెం ఆకారంలో ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం రబ్బరు మొక్కను ధనానికి, అదృష్టానికి సూచికగా భావిస్తారు.

యూకలిప్టస్ : ఈ మొక్క ఆకులు వెండి నాణెం ఆకారంలో ఉంటాయి. వాస్తుప్రకారం దీన్ని ఇంట్లో పెంచుకుంటే ఎన్నో ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. సంపద, శ్రేయస్సు, అదృష్టంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

మనీ ప్లాంట్ : ఈరోజుల్లో చాలా మంది ఇళ్లలో దీనిని పెంచుకుంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది దాని పేరుకు తగినట్లుగానే సంపద, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. అలాగే ఈ ప్లాంట్లు డబ్బును ఆకర్షిస్తాయని చెబుతారు. అయితే దీని కొమ్మలు నేలకు తాకకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ మొక్క ప్రతికూల శక్తి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

తులసి : అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన అదృష్ట మొక్కలలో ఒకటి తులసి మొక్క. ఇది ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తుల్ని పారద్రోలి పాజిటివిటీని పెంచుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచితే సంపద, అదృష్టం, ప్రేమ అన్నీ మీ సొంతమవుతాయి. ఆర్థికంగా సక్సెస్ అవడానికి సహాయపడుతుంది.

ఇవేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం మీ ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో పచ్చ చామంతి, బంతి పూల మొక్కలు, రోజ్మెరీ, పియోనీ వంటి మొక్కలు పెంచుకున్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి సంపద, అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

దోమలతో ఇబ్బందా?.. మీ ఇంట్లో ఈ మొక్కలను పెంచుకుంటే హాం ఫట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.