ETV Bharat / spiritual

సోమవతి అమావాస్య రోజు ఇలా చేస్తే జాబ్​ గ్యారంటీ- కష్టాలన్నీ పరార్! - somvati amavasya 2024 importance - SOMVATI AMAVASYA 2024 IMPORTANCE

Somvati Amavasya Pooja Process In Telugu : ఇంట్లో ప్రతికూల శక్తులతో అశాంతిగా ఉందా? అరుదుగా వచ్చే సోమవతి అమావాస్య రోజున ఎలాంటి పరిహారాలు చేస్తే దారిద్ర్య బాధలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Somvati Amavasya April 2024
Somvati Amavasya April 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 5:04 PM IST

Somvati Amavasya Pooja Process In Telugu : సోమవారం రోజు వచ్చే అమావాస్యకు శాస్త్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. దీనినే సోమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు వివిధ దేవతలకు చేసే పూజలు, పాటించే పరిహారాల ద్వారా సకల శుభాలు కలుగుతాయని పురాణాలు గోచరిస్తున్నాయి. మరి ఉగాది పర్వదినానికి ముందురోజు వస్తున్న ఈ సోమవతి అమావాస్యకు సంబంధించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సోమవతి అమావాస్య ఏ రోజున వస్తుంది?
Somvati Amavasya April 2024 : హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అయితే ఈ అమావాస్య సోమవారం రోజున వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈనెల 8వ తేదీన సోమవతి అమావాస్య వస్తుంది.

సోమవతి అమావాస్య పురాణ కథనం!
Somvati Amavasya Significance : దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు.

ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం.

సోమవతి అమావాస్య పూజావిధానం
సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివునికి గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.

ఈ పరిహారాలతో లక్ష్మీ కటాక్షం!

  • సోమవతి అమావాస్య రోజున రాహుకాలంలో రావిచెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే దరిద్రం పోతుంది.
  • రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. వీలు కానివారు శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది.
  • శివకేశవులకు నైవేద్యంగా సమర్పించిన పండ్లను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
  • సోమవతి అమావాస్య రోజు ఇంటికి ఈశాన్యం దిక్కులో సాయం సంధ్య వేళ ధనలక్ష్మి దేవీ ప్రీతి కోసం ఆవునేతితో దీపం వెలిగించి ఆ ప్రమిదలో కుంకుమ, పువ్వు, పచ్చ కర్పూరం వేసి నమస్కరించుకుంటే దరిద్రం పోయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

కుటుంబ ఐక్యత కోసం ఇలా చేయండి
సోమవతి అమావాస్య రోజున నల్ల చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా పెట్టడం వలన జీవితంలో ఎదురయ్యే కష్టాలు తొలగిపోయి, కుటుంబంలో ఐక్యత వృద్ధి చెందుతుంది.

ఇలా చేస్తే ఉద్యోగప్రాప్తి
సోమవతి అమావాస్య రోజున పూజామందిరంలో శుభ్రం చేసిన నిమ్మకాయను ఉంచి సాయంత్రం ఆ నిమ్మకాయను ఉద్యోగం కోరుకునే వారి తలపై నుంచి మూడుసార్లు దిష్టి తీసి, ఆ తరువాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కుల్లో వేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. శివ పురాణంలో సూచించిన ఈ పరిహారాలు చేయడం వలన ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఏలినాటి శనితో బాధపడుతున్నారా? శనివారం ఈ పూజ చేస్తే దోషాలు మాయం! - shani pradosha pooja telugu

సొంతింటి కల నెరవేరాలా? ఆవు చుట్టూ 7ప్రదక్షిణలు, వరాహ స్వామికి ఈ పూజ చేస్తే చాలు! - Vastu Tips For Own House

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.