Rules Before Presenting Bilvapatra To Lord Shiva : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ఆ పరమ శివుడికి అత్యంత పవిత్రమైన ఈ రోజున ఆ రుద్రుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరడంతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రముఖ పుణ్య క్షేత్రాలు, ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
అయితే.. ఈ రోజున చాలా మంది ఆ పరమ శివుడి ఆశీస్సులు తమపైన ఉండాలని.. శివునికి బిల్వపత్రాలను సమర్పిస్తుంటారు. ఇలా చేయడం వల్ల పాపాలు అన్నీ తొలగిపోయి, పుణ్యం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. అయితే.. కొంత మంది బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు చేసే తప్పుల వల్ల పూర్తి ఫలం దక్కకుండా పోతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి.. శివుడికి బిల్వపత్రం లేదా మారేడు ఆకులను సమర్పించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.
Maha Shivratri 2024 శివపూజలో బిల్వపత్ర ప్రాముఖ్యత :
పురాణాల ప్రకారం.. బిల్వపత్ర చెట్టు పార్వతీ దేవి చెమట నుంచి ఉద్భవించినట్లు పండితులు చెబుతారు. పార్వతీ దేవి అన్ని రూపాలూ ఈ చెట్టులో ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రుద్రుడిని 'బిల్వపత్రే' అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు స్వర్గంలో ఉన్న కల్పవృక్షంతో సమానమట. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆకులతో శివుడిని పూజిస్తే.. ఇక, ఏ అలంకరణ కూడా చేయాల్సిన అవసరం లేదని అంటుంటారు.
మహాశివరాత్రి నాడు ఇవి కొనుగోలు చేస్తే - అర్ధనారీశ్వరుడి అనుగ్రహం లభించినట్టే!
శివుడికి బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఈ నియమాలను పాటించాలి :
- బిల్వపత్రాలను తెంపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
- ఉదయాన్నే స్నానం చేసి కొత్త బట్టలను ధరించి మొదట చెట్టుకు పూజలు చేయాలి.. ఆ తర్వాతనే ఆకులను తెంపండి. ఆకులు చిరిగిపోకుండా జాగ్రత్తగా తెంపండి.
- అలాగే పురుగులు లేనివి, రంధ్రాలు లేనివి చూసి తెంపండి.
- బిల్వపత్రాలను తెంపిన తర్వాత వాటిని శుభ్రంగా నీటితో కడిగి, గంధంతో ఆకులపై ఓం అని రాయాలి.
- శివునికి ఒక్క బిల్వపత్రాన్ని సమర్పించకూడదు. మూడు ఆకులను కలిపి సమర్పించాలి.
- బిల్వపత్రం ఎప్పుడూ కూడా అపవిత్రం కాదు. కానీ, ఒకసారి పూజకి ఉపయోగించిన ఆకులను తిరిగి శివపూజలో సమర్పించకూడదు. ఇతర పూజలలో ఉపయోగించవచ్చు.
- లేతగా ఉండే బిల్వపత్ర ఆకులను శివుడికి సమర్పించాలి. అవి సమర్పించేటప్పుడు తలకిందులుగా ఉండకూడదు.
- రుద్రుడికి జలాభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రాన్ని సమర్పించండి.
- ఆ పరమశివునికి బిల్వపత్రాన్ని సమర్పించేటప్పుడు ఉంగరపు వేలు, మధ్యవేలు, బొటనవేలు ఉపయోగించి సమర్పించాలి.
- బిల్వపత్రాన్ని తీస్తున్నప్పుడు 'కీల్బరదాయ ఓం నమః శివాయ' మంత్రాన్ని పఠించాలి.
బిల్వపత్రాన్ని ఏ రోజుల్లో తెంపకూడదు?
బిల్వపత్రాలను సోమవారం, అమావాస్య రోజు, మకర సంక్రాంతి, పూర్ణిమ, అష్టమి, నవమి రోజుల్లో తెంపకూడదని పండితులు అంటున్నారు.
శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే నీరసం అస్సలే రాదు!
మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? - ఈ స్మూతీ తాగితే నీరసం అనేది ఉండదు!