ETV Bharat / spiritual

దారిద్ర్య దుఃఖాలను పోగొట్టే సోమావతి అమావాస్య కథ - Somvati Amavasya pooja 2024

Somvati Amavasya pooja 2024 : తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలా అమావాస్య తిథి వస్తుంది. అయితే ఈ అమావాస్య సోమవారం రోజున వస్తే ఆ రోజును సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు. సెప్టెంబర్ 2వ తేదీ సోమావతి అమావాస్య సందర్భంగా వ్రత కథను ఈ కథనంలో తెలుసుకుందాం.

Somvati Amavasya pooja 2024
Somvati Amavasya pooja 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 4:33 AM IST

Somvati Amavasya pooja 2024 : ఏ వ్రతమైనా, పూజైనా పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే పూజ సంపూర్ణం అవుతుంది. అందుకే వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి.

సోమావతి అమావాస్య కథ
పూర్వం ఒక ఊరిలో నిరుపేద దంపతులు, యుక్త వయస్కురాలైన కూతురితో నివసిస్తుండేవారు. ఆ దంపతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కూతురికి వివాహం చేయలేక పోయారు. ఒకరోజు ఒక మునిపుంగవుడు వారి ఇంటికి ఆతిథ్యానికి రాగా అతనిని గౌరవించి, భోజనానంతరం తమ కుమార్తె విషయం తెలిపి ఆశీర్వదించమనగా ఆ ముని ఈ యువతికి వివాహ యోగం లేదని చెప్పెను. అందుకు వారు కలత చెంది ఇందుకు పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కోరారు.

అప్పుడు ఆ ముని అక్కడకు దగ్గరలో “సోమ” అని ఒక సత్ప్రవర్తన గల ఇల్లాలు కలదని, వారి కుమార్తె ఆమె నుంచి కుంకుమ పొందినచో వివాహము జరుగునని తెలిపెను. అంతట ఆ దంపతులు వారి అమ్మాయిని ప్రతిరోజు సోమావతి దేవి ఇంట్లో ఆమెకు సహాయముగా పనిచేయమని పంపించారు. కొన్ని రోజుల తర్వాత సోమావతి ఆ అమ్మాయి తన ఇంట్లో పని చేయడానికి కారణమేమిటని అడుగగా, ఆ అమ్మాయి ముని చెప్పిన సమాచారమంతా సోమావతికి తెలిపింది.

అప్పుడు సోమావతి ఆ యువతికి తన పాపిట నుంచి సగం కుంకుమను తీసి ఇవ్వగా, ఆ యువతి దానిని ధరించింది. కొన్ని దినములకు ఆ అమ్మాయికి వివాహ ఘడియలు ఏర్పడి కళ్యాణం జరిగింది. కానీ ఇక్కడ సోమావతి పాపిటలో కుంకుమ తగ్గగానే, ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. అంతట సోమావతి కఠోర నిష్టతో పరమ శివుని ధ్యానించి, రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి, పాత్రలోని కొంత నీటిని చెట్టుకు పోసి, మిగిలిన నీరు త్రాగగా తన భర్తకు ప్రాణాపాయం తొలిగి, పునర్జీవితుడయ్యాడు. ఆనాటి నుంచి సోమావతి అమావాస్యకు విశిష్టత ఏర్పడింది. సోమావతి అమావాస్య నాడు అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైనా శివాలయంలో వెలిగించాలని పెద్దలంటారు. ఇదేనండి సోమావతి అమావాస్య కథ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

శివుడికి భక్తుల పిటిషన్లు- రోజూ చదివి వినిపించే పూజారి- ఇలా చేస్తే కోరికలు తీరుతాయట! - Arji Wale Mahadev Temple

ఇలా చేస్తే దేవుడి అనుగ్రహం మీపైనే- భగవంతుడికి భక్తే ప్రధానం! - how to pray god in hinduism

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.