ETV Bharat / spiritual

నేడు ఆ రెండు రాశుల వారు ఏ పని చేసినా విజయమే! మిగతా వారి పరిస్థితేంటి? - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 4:32 AM IST

Horoscope Today June 21st 2024 : జూన్​ 21న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today June 21st 2024 : జూన్​ 21న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. గృహంలో శాంతి నెలకొంటుంది. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తారు. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళతారు. ఇంటా బయట అందరితో పరస్పరం సహకరించుకుంటే ముందుకెళ్తే విజయం మీదే! ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. షేర్ మార్కెట్లు, స్పెకులేషన్లు ఈ రోజు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఆర్ధికంగా తీవ్రమైన నష్టాలు రావడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. అయితే ముందు జాగ్రత్తతో అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకునే నష్ట తీవ్రత తగ్గుతుంది. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడిపితే ప్రశాంతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి దండకం పఠిస్తే మనోబలం పెరుగుతుంది. ఆపదలు తొలగుతాయి.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కాలం కలిసివస్తుంది. నూతన బాధ్యతలను చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కళలు, సాహిత్య రంగం వారికి శుభసమయం నడుస్తోంది. బిరుదులు, సత్కారాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి పనుల్లో వ్యతిరేక ఫలితాలు ఉండవచ్చు. తీవ్ర ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. సహనంతో ఉండడం అవసరం. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి పరంగా నైపుణ్యాలను పెంచుకుంటారు. పరోపకారానికి పోయి చిక్కుల్లో పడే అవకాశముంది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సువర్ణావకాశం రానేవచ్చింది. మీలో దాగిఉన్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు ప్రతిభకు తగిన పురస్కారం ఉంటుంది. ఆదాయం మూడింతలు పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం, పదవీయోగం వరిస్తాయి. గణపతి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలలో మెరుగైన పురోగతి, ధన లాభం ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా సమయస్ఫూర్తితో అందరినీ సంప్రదించి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి కారణంగా శారీరక శ్రమ పెరుగుతుంది. తగిన విశ్రాంతి అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. గురుధ్యాన శ్లోకాలు పఠిస్తే ప్రశాంతత కలుగుతుంది.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర అలసటకు గురవుతారు. ప్రతికూల ఆలోచనల కారణంగా ప్రశాంతత లోపిస్తుంది. ఇతరులు చేసే విమర్శలను పట్టించుకోవద్దు. అన్ని రంగాలవారు పని పట్ల ఏకాగ్రత, చిత్తశుద్ధితో ఉంటే విమర్శకులు మీ జోలికి రారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. వ్యాపారస్తులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలలో పాల్గొంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. హనుమాన్ ఆరాధన శక్తినిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను పట్టించుకోవద్దు. మిమ్మల్ని దెబ్బ తీయడానికి ప్రత్యర్ధులు, అవకాశవాదులు ఎదురు చూస్తున్నారు. సమయానుకూలంగా నడుచుకుంటే విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనవసర చర్చలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక నష్టాలు, పెరిగిన ఖర్చులతో ఆందోళన నెలకొంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి తీవ్ర కృషితోనే మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. పదోన్నతి కోసం ఎదురు చూసేవారు శుభవార్తలు వింటారు. వాహన ప్రమాదాలు జరిగే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గృహంలో కలహపూరిత వాతావరణం ఉండవచ్చు. వాదనలకు అవకాశమివ్వదు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి నిపుణులకు వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదం అవుతుంది. ఇంట్లో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి శుభసమయం. మీ కోరిక నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల వారికి పనిలో పురోగతి, ఆదాయం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఫైనాన్స్ , కమిషన్ వ్యాపారులకు ధనాదాయం పెరుగుతుంది. కళాకారుల ప్రతిభకు పురస్కారాలు అందుకుంటారు. కుటుంబంలో శాంతి సౌఖ్యం ఉంటాయి. శివాష్టకం పఠిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కళాకారులకు, వృత్తి నిపుణులకు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు ఈ రోజు చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులపై ఆర్థిక లబ్థి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగాల్లో మార్పు కోరుకునే వారికి, నిరుద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.