ETV Bharat / spiritual

బీకేర్ ఫుల్- ఆ రాశుల వారికి చిన్నపాటి సమస్యలు గ్యారెంటీ! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 3:32 AM IST

Horoscope Today July 19th 2024: జులై​ 19న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today
Horoscope Today (ETV Bharat)

Horoscope Today July 19th 2024: జులై​ 19న (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. శుభకార్యాలలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల మానసిక అశాంతికి గురవుతారు. ఆరోగ్యం సహకరించదు. మొండితనం వీడి సర్దుబాటు ధోరణితో ఉంటే మంచిది. యోగా, ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది. నవగ్రధ్యానం మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాజెక్టుల జోలికి పోవద్దు. వృత్తి వ్యాపారాలలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల అలసిపోతారు. వ్యాపారులకు ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. విందువినోదాలలో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వాహనయోగం ఉంది. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు తలపెట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులకు కలిసివచ్చే రోజు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. దుర్గా ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా రచయితలకు, కళాకారులకు శుభ ఫలితాలు ఉంటాయి. గౌరవ పురస్కారాలు పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల వారికి ఊహించిన దానికంటే గొప్ప ఫలితాలు ఉంటాయి. సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులకు తగినట్లుగా ఆదాయం ఉంటుంది. శుభాలనిచ్చే లక్ష్మీస్తోత్రం చదవండి.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తారాబలం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, సవాళ్లు ఎదురవుతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. గతంలో చేసిన పొరపాట్ల గురించి ఆలోచిస్తుంటారు. ఉద్యోగులు ఎంత కష్టపడినా ఫలితం లభించక నిరాశకు గురిఅవుతారు. సహనంతో ఉంటే మేలు. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేసే పనిలో కార్యసిద్ధి, విజయం ఉంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. స్నేహితులతో కలిసి పర్యటక ప్రదేశాలలో పర్యటిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. దైవబలం అండగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే విజయం మీ సొంతం. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకులిస్తున్నందున ఈ రోజు అన్ని రంగాల వారికి శుభప్రదమైన రోజు. వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీరు ఆధ్యాత్మికంగా గడుపుతారు. తీర్థయాత్రలకు వెళతారు. దైవ సంబంధ కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొన్ని లీగల్ వ్యవహారాలు సెటిల్ అవుతాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేస్తే మంచిది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం సహకరించదు. బంధువులతో కలహాలు సూచితం. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. కోర్టుకు సంభందించిన విషయాల్లో శ్రద్ద వహించండి. హనుమాన్ చాలీసా పఠనం మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ రోజు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి శుభప్రదమైన రోజు. అన్ని రంగాల వారికి ఊహించని ధనలాభాలు ఉంటాయి. సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్ఠలు అందుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి ఈ రోజు ఆశాజనకంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాల్లో దూకుడుగా ఉండవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మేలు. ప్రతికూల ఆలోచనలు వీడి సానుకూల దృక్పధాన్ని పెంచుకుంటే మంచిది. అన్ని రంగాల వారు తమ వృత్తి పట్ల అంకిత భావం, చిత్తశుద్ధితో ఉంటేనే మంచిది. ఇష్ట దేవతారాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.