ETV Bharat / entertainment

దీపిక 'బేబీ బంప్‌' ఫొటోషూట్- రణ్​వీర్​తో క్యూట్ ఫోజులు - Deepika Padukone Baby Bump - DEEPIKA PADUKONE BABY BUMP

Deepika Padukone Baby Bump Photos: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసింది. మరి మీరు ఈ ఫొటోలు చూశారా?

Deepika Baby Bump
Deepika Baby Bump (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 8:19 PM IST

Deepika Padukone Baby Bump Photos: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ మూమెంట్స్​ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టీవ్​గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్​ను షేర్ చేస్తుంది. తాజాగా తన భర్త రణ్​వీర్ సింగ్​తో కలిసి బేబీ బంప్ ఫొటో షూట్​లో పాల్గొంది. ఈ షూట్​కు సంబంధించిన ఫొటోలు సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరికొన్ని వారాల్లోనే దీపికా- రణ్​వీర్ తల్లిదండ్రులు కానున్నట్లు ఈ ఫొటోలు చూస్తే తెలుస్తోంది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా, 2024 ఫిబ్రవరిలో దీపిక తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. అప్పటి నుంచి సినిమా షూటింగ్​లకు దూరంగా ఉంటూ వస్తోంది. అయితే రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కల్కి AD 2898' ప్రమోషన్స్​లో మాత్రం దీపికా బయటకు వచ్చింది. బేబీ బంప్​తోనే సినిమా ప్రమోషన్స్​లో పాల్గొంది. ఇటీవల ముంబయిలో గ్రాండ్​గా జరిగిన వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లికి కూడా ఈ జంట హాజరై అట్రాక్షన్​గా నిలిచింది.

బిడ్డ కోసం కీలక నిర్ణయం
తనకు పుట్టబోయే బిడ్డ కోసం దీపికా పదుకొణె ఓ కీలక నిర్ణయం తీసుకుందట. బిడ్డకు జన్మనిచ్చాక ఎక్కువ సమయం బేబీతోనే గడపాలని నిర్ణయం తీసుకుందని తెలిసింది. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు పిల్లలను కేర్​టేకర్స్‌కు అప్పగిస్తున్నారు. కానీ, తాను అలా చేయనని, తన బిడ్డ ఆలనాపాలనా మొత్తం స్వయంగా తానే చూసుకుంటానని చెప్పినట్లు బీ టౌన్​లో వార్తలు వస్తున్నాయి.

అలానే తన భర్త రణవీర్ సింగ్​ను కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యేలా చేయాలని అనుకుంటుందట. తల్లిదండ్రుల పరిరక్షణలోనే బిడ్డ ఎదిగితే ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకుని అభిమానులు దీపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా, దీపిక రీసెంట్​గా 'కల్కి AD 2898' సినిమాతో భారీ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో సుమతి అనే కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. పాన్ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్​వైడ్​దా రూ.1100కోట్లు వసూల్ చేసింది.

పుట్టబోయే బిడ్డ కోసం దీపికా పదుకొణె కీలక నిర్ణయం! - ఫ్యాన్స్ ప్రశంసలు

దీపికా పదుకొణె రేర్​ ఫీట్​ - రూ.1000 కోట్ల హ్యాట్రిక్ సక్సెస్​! - Kalki 2898 AD Deepika Padukone

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.