ETV Bharat / spiritual

ఈ రాశివారికి ఈరోజు వ్యాపారంలో కలిసొస్తుంది! చేసే పనులన్నింటిలోనూ శుభఫలితాలే - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 4:36 AM IST

Horoscope Today July 18th 2024: జులై​ 18న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (Source: ETV Bharat)

Horoscope Today July 18th 2024: జులై​ 18న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. దూకుడుగా తీసుకునే ఒక్క నిర్ణయం ఏళ్ల తరబడి కష్టాన్ని తుడిచేస్తుంది. ఎవరి ఒత్తిడికీ లోనుకాకుండా నిర్ణయాలు తీసుకుంటేనే మంచిది. ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అవసరానికి ధనం అందుతుంది. గురు శ్లోకాలు పఠిస్తే మేలు జరుగుతుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. వృతివ్యాపారాల్లో రాణిస్తారు. ఉద్యోగస్థులకు పనులన్నీ సకాలంలో పూర్తి కావడం వల్ల విశ్రాంతి తీసుకుంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి. దూరదేశాల నుంచి మంచి వార్త వింటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. ఉద్యోగస్థులకు చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. అనుకోని విధంగా అదనపు ఆదాయం చేకూరుతుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. చిన్నపాటి అనారోగ్యం కలత పెడుతుంది. వృత్తివ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆందోళన చెందవద్దు. సంయమనం పాటించండి. అన్నీ సర్దుకుంటాయి. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తివ్యాపారాల్లో రాజీ ధోరణి అవలంబిస్తే మేలు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆర్ధికంగా లాభం ఉంటుంది. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఆస్తి వ్యవహారాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. దుర్గా దేవి ధ్యానం మేలు చేస్తుంది.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్థులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. ఒంటరిగానే సవాళ్లు, పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది. మనోబలంతో ముందడుగు వేస్తే విజయం సిద్ధిస్తుంది. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. నూతన బాధ్యతలు చేపడతారు. ఆర్ధికంగా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇతరుల మాటలకు ఎక్కువ విలువ ఇవ్వొద్దు. మీ సొంత తెలివితేటలతో చేసే పనులే సక్రమంగా ఉంటాయి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగస్థులకు ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఉత్సాహంగా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ఓర్పుగా ఉండండి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ముందడుగు వేయండి. కోర్టు వ్యవ్యహారాలు ఎటూ తేలక చికాకు కలిగిస్తాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్థులు ఆత్మ విశ్వాసంతోనూ పని చేసి, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. వైద్య ఖర్చుల నిమిత్తం ధనవ్యయం ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు వివాహం నిశ్చమవుతుంది. కోరుకున్నవన్నీ నెరవేరుతాయి. ఆస్తి వ్యవహారాల సంబంధించి ఒప్పందాలు చెయ్యడానికి ఇది సరైన రోజు. యాజమాన్యం నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారస్థులు ఆర్ధికంగా విపరీతమైన లాభాలు అందుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన అన్ని పనులు సులభంగా, సకాలంలో పూర్తవుతాయి. వృత్తి పరంగాను, వ్యక్తిగత జీవితంలోను ఎటు చూసినా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపారస్థులకు, వృత్తినిపుణులకు ఊహించని ధన లాభాలు ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్థులు సమర్ధంగా పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార రంగాల వారు ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు సమయాన్ని వృధా చేయకుండా పని పట్ల శ్రద్ధ పెడితే మంచి ఫలితాలను అందుకోగలరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ వ్యహారాలలో కోపాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. దేవి ధ్యానం శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.