ETV Bharat / spiritual

ఆ రాశివారు శ్రీలక్ష్మీ ధ్యానం చేస్తే - ఉద్యోగం రావడం గ్యారెంటీ! - Horoscope Today

Horoscope Today July 11th 2024 : జులై​ 11న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 4:31 AM IST

Horoscope in telugu July 11th 2024
Horoscope Today July 11th 2024 (ETV Bharat)

Horoscope Today July 11th 2024 : జులై​ 11న (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు పనికిరాదు. పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. తగిన విశ్రాంతి అవసరం. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కష్టించి పనిచేసి, అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. నూతన బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఆర్ధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు తెలివిగా వ్యవహరిస్తే మంచిది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రమోషన్ అవకాశం ఉంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తరచుగా వచ్చే ప్రతికూల ఆలోచనలతో నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తికాక ఇబ్బంది పడతారు. కుటుంబంలో ఏర్పడిన సమస్యలను సావధానంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ ప్రగతి మార్గంలో ఉన్న అవరోధాలను తొలగించుకుంటారు. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కొత్త పనులు, బాధ్యతలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో రాబడి అధికంగా ఉంటుంది. కుటుంబ సంబంధాల విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, జీవిత భాగస్వామి సహకారంతో సులభంగానే పరిష్కారమవుతుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ మొండితనం, కోపస్వభావం కారణంగా ఎంతో నష్టపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా కూడా శత్రువులు పెరుగుతారు. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. పెద్దలు, గురువుల సలహాలను పాటిస్తే మంచిది. ఆర్థికపరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నృసింహస్వామిని ఆరాధిస్తే కోపస్వభావం తగ్గి ప్రశాంతంగా ఉంటారు.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఎలాంటి ఒత్తిడిలు లేని ప్రశాంతమైన రోజు. కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లి సరదాగా గడుపుతారు. దైవదర్శనం కోసం వెళతారు. అన్ని రంగాల వారికి గురుబలం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సిద్ధిస్తుంది. సంపద పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. సమస్యలన్నీ తీరి ప్రశాంతంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తెలివితేటలతో వ్యవహరించాలి. వదంతులను నమ్మకూడదు. మీ పనితీరుతో, మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అందరికీ మార్గదర్శకంగా ఉంటారు. ఇది మీపై మరింత బాధ్యతను పెంచుతుంది. గురు శ్లోకాలను పఠిస్తే శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగుల పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు మీ ఆరోగ్య పరిస్థితి దిగజారిపోవడమే వీటన్నింటికి కారణం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తగిన విశ్రాంతి తీసుకుంటూ వైద్యుల సూచనల మేరకు నడుచుకుంటే మంచిది. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలు ఉన్నవారితో వాదనలు వద్దు. సహోద్యోగుల సహకారం కొంత వరకు ఉంటుంది. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పారాయణతో అన్ని సమస్యలు తొలగిపోతాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో పెనుమార్పులు రానున్నాయి. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం బాగుటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఈశ్వర ఆరాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది. మీ పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అద్భుతాలు సృష్టిస్తారు. చేపట్టిన అన్ని పనులను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఊహించని ధనలాభాలు ఉంటాయి. వ్యాపారులకు గతంలో రావలసిన బకాయిలు వసూలు అవుతాయి. ప్రభుత్వం సహకారం పొందుతారు. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూలత ఉంటుంది. ఇంటా, బయటా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.