ETV Bharat / spiritual

గురువారం ఆ పూజ చేస్తే - గురు దోషం పోవడం, ఐశ్వర్యం రావడం గ్యారెంటీ! - Guru Dosha Nivarana Puja

Guru Dosha Nivarana Puja : హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గురువారానికి ప్రత్యేక స్థానముంది. గురువారం ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అవుతుందని విశ్వాసం. మరి గురువారానికి ఈ ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి గురువారం ఎలాంటి నియమాలు పాటించాలి? గరు పూజ వల్ల ఎలాంటి దోషాలు పోతాయి. అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 9:32 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Guru Dosha Nivarana Puja : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారానికి అధిపతి బ్రహస్పతి. దేవగురువైన బృహస్పతి అధిపతిగా ఉన్న గురువారం వారాలన్నింటిలోకెల్లా శుభకరమైనదని విశ్వాసం. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా, ఐశ్వర్యం, పదవీయోగం, గౌరవ ప్రతిష్టలు లాంటి శుభ ఫలితాలు పొందాలన్నా, ఆ వ్యక్తి జాతకంలో గురు స్థానం బలంగా ఉండాలి. అందుకే గురువు అధిపతిగా ఉన్న గురువారం విజయాలకు సంకేతమని భావిస్తారు.

గురు దోషం ఉంటే?
జాతకరీత్యా గురు దోషం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సమస్యలు ఎదుర్కొంటాడు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు, శ్రమకు తగిన ఫలితం లేకపోవడం, వివాహ సంబంధాలు కుదిరినట్లే కుదిరి వెనక్కి పోవడం ఇలాంటివన్నీ గురుదోషం వల్లనే ఏర్పడుతాయి.

గురు దోషం పరిహారాలు
ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. తాళం తయారు చేసినప్పుడే తాళం చెవిని కూడా తయారు చేస్తారు. అలాగే సమస్య ఏర్పడినప్పుడే దాని పరిష్కారం కూడా పుడుతుంది. కాకపోతే మనం దాన్ని గుర్తించడానికి సమయం పడుతుంది. గురు దోషానికి మన జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలను సూచించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మార్గం చూపేది గురువే!
ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారాన్ని వెతికే క్రమంలో మనకు సహాయపడేవాడే గురువు. అందుకే క్లిష్టమైన సమస్యలున్నప్పుడు గురువును ఆశ్రయిస్తే, సమస్యల పరిష్కారానికి మార్గం తెలుస్తుంది! బాగా గుర్తు పెట్టుకోండి! సమస్యలు, కష్టాలు అనేవి మన కర్మ ఫలంగానే వస్తాయి. అయితే గురువులను ఆశ్రయిస్తే ఆ కర్మఫలం వలన కలిగే సమస్యల నుంచి బయట పడటానికి మార్గం దొరుకుతుంది. అందుకే 'గు' అంటే చీకటి 'రు' అంటే పోగొట్టేవాడు అనే అర్థం చెప్పారు. అంటే అజ్ఞానమనే చీకట్లను పోగొట్టి జ్ఞానమనే వెలుగు వైపుకి నడిపించేవాడే నిజమైన గురువు అని అర్థం.

గురు దోషాలకు ఎలాంటి పరిహారాలను పాటించాలి

  • గురువారం రోజు గోమాతకు నానబెట్టిన శనగలు తినిపించడం వలన గురుదోషం పోతుంది.
  • ఆదిగురువు పరమేశ్వరుని స్వరూపమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని సూర్యాస్తమయం తర్వాత భక్తి, శ్రద్ధలతో మూడు సార్లు పఠిస్తే గురు గ్రహ దోషం పోతుంది.
  • గురు స్వరూపంగా భావించే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయాలను గురువారం దర్శించి, ప్రదక్షిణలు చేయడం వలన కూడా గురుదోషం నివారిణ అవుతుంది.
  • సాయిబాబా వారి ఆలయంలో కానీ, దత్తాత్రేయ స్వామి ఆలయంలో కానీ, గురువారం పసుపు రంగు ప్రసాదాలు సమర్పించాలి. అంటే నిమ్మకాయలతో చేసిన పులిహోర కానీ, లడ్డూలు లాంటివి కానీ దేవునికి సమర్పించి అటు తర్వాత ప్రసాదంగా గుడిలో అందరికీ పంచి పెడితే గురు గ్రహ అనుకూలత లభిస్తుంది.
  • గురువారం పసుపు రంగు పూలతో గురువును పూజించాలి.
  • గురువారం పేదలకు చేసే అన్నదానం అన్నింటికంటే శ్రేష్టం. అన్నదానం ద్వారా గురు గ్రహ దోషం తొలగిపోతుందని శాస్త్ర వచనం.
  • మన ధర్మ శాస్త్రాల్లో చెప్పిన ఈ పరిహారాలను పాటించి గురువు అనుగ్రహాన్ని పొందండి. సుఖమయ జీవితాన్ని ఆస్వాదించండి.

శుభం భూయాత్!
పైన చెప్పిన పరిహారాలకు హిందూ పురాతన ధర్మశాస్త్రాలు, జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలతో పాటు పురాణకర్తలు, ప్రవచన కర్తలు చెప్పిన అమూల్యమైన సందేశాలు మూలాధారం.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

సర్వ విఘ్నాలు తొలగించే బల్లాలేశ్వర్ గణపతి! ఆ దివ్య క్షేత్రం ఎక్కడుందంటే? - Famous Ganapati Temple

మంగళవారం ఈ పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలకు చెక్! అంజన్నను ఇలా పూజిస్తే కష్టాలన్నీ పరార్! - devotional

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.