దేశంకాని దేశంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉంటున్న ప్రవాసాంధ్రులందరినీ ఒకచోట చేర్చే చికాగో ఆంధ్ర సంఘం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. CAAఅధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి ఈ వేడుకలను దగ్గరుండి నిర్వహించారు. వార్షికోత్సవాలకు చికాగో నగరానికి చెందిన సుమారు1100 మందికి పైగా అతిథులు హాజరయ్యారు.
చికాగో ఆంధ్ర సంఘం 8వ వార్షికోత్సవం, రత్నం చిట్టూరికి లైఫ్ టైం అచీవ్మెంట్ - Chicago Andhra Association - CHICAGO ANDHRA ASSOCIATION
చికాగో ఆంధ్ర సంఘం(CAA)అష్టమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యెల్లో బాక్స్ (Yellow Box) ఆడిటోరియంలోజరిగిన వార్షికోత్సవ వేడుకలకు చికాగో వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రవాసాంధ్రులంతా ఒక చోట చేరి సంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు.
చికాగో ఆంధ్ర సంఘం
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 11:15 AM IST