Z Category Security for Nara Lokesh : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ కేటగిరి భద్రత కల్పించింది. సీఅర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ మేరకు కల్పించింది. అక్టోబర్ 2016 ఏఓబీ ఎన్కౌంటర్ తరువాత లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించాలని నాటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లోకేశ్‌కు భద్రత తగ్గించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సులు పక్కన పెట్టి లోకేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరి మాత్రమే కల్పిస్తూ వచ్చింది.
టీడీపీ ఎన్నికల ప్రచారం షురూ - నేటి నుంచి ప్రజల్లోకి చంద్రబాబు - Lok Sabha Elections 2024
లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత : తగిన భద్రత కల్పించాలంటూ 14 సార్లు రాష్ట్ర హోమ్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్లకు లోకేశ్ భద్రతా సిబ్బంది లేఖలు రాశారు. భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అనేక సార్లు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. యువగళం పాదయాత్రలో లోకేశ్ లక్ష్యంగా అనేక సార్లు వైకాపా ప్రేరేపిత దాడులను రాష్ట్ర హోమ్ శాఖ, కేంద్ర హోమ్ శాఖ, గవర్నర్లకు లోకేశ్ భద్రతా సిబ్బంది వివరించారు. గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతా పరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారాన్ని కూడా పరిశీలించిన కేంద్రం లోకేశ్‌కు జెడ్ కేటగిరి భద్రత కల్పించింది.
Central Focus On Chandrababu And Lokesh Security: చంద్రబాబు, లోకేశ్ భద్రతపై దృష్టి సారించిన కేంద్రం