ETV Bharat / politics

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు - బయటపడ్డ సర్పంచి నిర్వాకం - ysrcp sarpanch fraud for pension - YSRCP SARPANCH FRAUD FOR PENSION

YSRCP Sarpanch Fraud for NTR Bharosa Pension: సోమవారం పింఛన్ల పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ, జనసేన నేతలు అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల పింఛన్ల అక్రమ బాగోతం బట్టబయలైంది. తిరుపతి జిల్లాలోని ఓ పంచాయతీలో వైఎస్సార్సీపీ సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు.

YSRCP Sarpanch Fraud for NTR Bharosa Pension
YSRCP Sarpanch Fraud for NTR Bharosa Pension (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 10:06 AM IST

YSRCP Sarpanch Fraud for NTR Bharosa Pension : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ 'సర్పంచ్​ల నుంచి సీఎం' వరకు అక్రమార్జన కోసం తప్పటడుగులు వేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కలగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లుగా వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వారికి అధికారులు సైతం వంతపాడటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రజల సొమ్ము కోసం వైఎస్సార్సీపీ నేతలు ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా సృష్టించడంతో టీడీపీ నేతలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఓ సర్పంచ్ వైకల్యం లేకున్నా పింఛన్ పొందడాన్ని చూసి అక్కడున్న వారు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. సర్పంచితో పాటు ఆమె భర్త, మరో 20 పింఛన్లు పొందడం కొనమెరుపు. ఈ రకమైన పింఛన్​దారులు రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు టీడీపీ నేతలు, అధికారులు చర్యలు చేపట్టారు.

వాలంటీర్ల అండతో అక్రమాలు : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైఎస్సార్సీపీ సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతో పాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో భాగంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది, స్థానిక టీడీపీ నాయకుల సమక్షంలో చేపట్టారు.

18 రోజుల్లోనే పింఛన్ల హామీని నెరవేర్చిన ప్రభుత్వం - లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు - Pension Distribution in AP

ఎలాంటి వైకల్యం లేకున్నా ప్రతి నెలా పింఛన్లు తీసుకుంటున్న ముంగిళిపట్టు సర్పంచి భారతి, ఆమె భర్త దామోదరం నాయుడి పేర్లను చూసి వారు అవాక్కయ్యారు. వీరితో పాటు మరో 20 మంది వరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు పింఛన్లు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. వాలంటీర్ల అండతో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా పింఛన్లు పొందగా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

పింఛన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది చేతివాటం - ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం - MLA Julakanti on secretariat staff

విచారణ చేపడతాం : సర్పంచి దంపతులు ఎంతకాలం నుంచి పింఛన్లు పొందుతున్నారన్నదానిపై విచారణ చేపట్టి చర్యల నిమిత్తం కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతామని, గ్రామ సభ నిర్వహించి అనర్హులు ఇంకెంత మంది ఉన్నారో విచారించి తొలగిస్తామని చంద్రగిరి ఎంపీడీవో సూర్యసాయి తెలిపారు.

చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం - పింఛన్ల పెంపుతో లబ్ధిదారుల ఆనందోత్సహాలు - PENSION BENEFICIARIES Happy

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.