ETV Bharat / politics

వైఎస్సార్సీపీకి భారీ షాక్! - రాజీనామాకు సిద్ధమైన ఎంపీలు - YSRCP MPS RESIGN - YSRCP MPS RESIGN

YSRCP MPs Resign? : వైఎస్సార్సీపీకీ కీలక నేతలు భారీ షాక్ ఇవ్వబోతున్నారు. కొందరు ఎంపీలు గురువారం ఆ పార్టీని వీడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ, బీజేపీలో చేరేందుకు కొందరు ఎంపీల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

YSRCP MPs Resign?
YSRCP MPs Resign? (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 3:03 PM IST

Updated : Aug 28, 2024, 8:15 PM IST

YSRCP MPs Resign? : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం వైఎస్సార్సీపీ మూటగట్టుకుంది. అనంతరం ఆ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్​లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. పలు మేయర్లు, కౌన్సిలర్లు ఆ పార్టీ గుడ్​ బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది రోజుల క్రితం పార్టీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటన మరువక ముందే మరో కోలుకోలేని దెబ్బ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చ.

వైఎస్సార్సీపీ మరో షాక్ - ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా

YSRCP Rajya Sabha MPs Resign? : వైఎస్సార్సీపీ ఎంపీలు ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకట రమణ (Mopidevi Venkata Ramana), బీదా మస్తాన్ రావు (Beeda Masthan Rao) గురువారం రాజీనామా చేయనునన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దిల్లీ బయలుదేరిన ఇద్దరు నేతలు గురువారం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్‌ ధన్‌ఖడ్‌​ని కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అనంతరం వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇద్దరూ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు బాటలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో ఎదురైన అవమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీ వీడుతున్నామని నేతలు అంటున్నారు. పలువురు ఎంపీలు బీజేపీ, జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

జగన్‌ విదేశీ పర్యటన - సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ - EX CM Jagan Foreign Tour

జగన్ రాజకీయంగా మరింత గడ్డు కాలం : వైఎస్సార్సీపీకి లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. ఆ పార్టీ రాజ్యసభలో ప్రస్తుతం 11 మంది ఎంపీలు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే పెద్దల సభలో వైఎస్సార్సీపీ ఉనికి కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే జగన్ రాజకీయంగా మరింత గడ్డు కాలం ఎదుర్కొక తప్పదు.

మోపిదేవి రాజకీయ నేపథ్యం : మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి మోపిదేవి వెంకట రమణ అత్యంత విధేయుడిగా పేరు. జగన్ అక్రమాస్తులు, వాన్ పిక్ కేసుల్లో ఆయన జైలుకు కూడా వెళ్లారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ నుంచి బైటకు వచ్చిన మోపిదేవి, జగన్ వెంటే నడిచారు. 2019లో మంత్రి పదవికి జగన్ బలవంతంగా రాజీనామా చేయించారనే అసంతృప్తి మోపిదేవిలో ఉన్నా మౌనం వహించారు. జగన్ ఒత్తిడి వల్లే రాజ్యసభకు వెళ్లారు. 2024 ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేయాలని మోపిదేవి భావించినా జగన్ టికెట్ ఇవ్వలేదు. చెరుకుపల్లికి చెందిన డాక్టర్ గణేష్‌ను నిలబెట్టగా ఆయన ఓడిపోయారు. రాజకీయాల్లో లేని వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చారని, పార్టీని, వైఎస్ కుటుంబాన్ని నమ్ముకున్న తనకు అన్యాయం చేశారని మోపిదేవి భావిస్తున్నారు.

2020లో వైఎస్సార్సీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవికి ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉంది. ఆయన టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి ఉమ్మడి గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడు. జగన్ వెంట ఉండి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా తనకు ఆయన అన్యాయం చేశారని సన్నిహితుల వద్ద మోపిదేవి వాపోయినట్లు సమాచారం. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఏలూరు వైఎస్సార్సీపీకి భారీ షాక్- మేయర్ సహా ప్రముఖులంతా టీడీపీలో చేరిక - Eluru Mayor join in TDP

పోతుల సునీత రాజీనామా: వైఎస్సార్సీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డికి లేఖ పంపారు. అలాగే శాసన మండలికి సైతం లేఖను పంపించారు. పోతుల సునీత శాసన మండలికి 2021లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 24 మార్చి 2021న శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Last Updated : Aug 28, 2024, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.