YSRCP MLA tickets for sale : కేంద్ర ఎన్నికల కమిషన్ మరికాసేపట్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్(Election notification) ప్రకటించనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రెండు జాబితాలతో మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను తేల్చేసిన టీడీపీ మరో 16 మందిని ప్రకటించాల్సి ఉంది. ఇక అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికి 12 జాబితాలు విడుదల చేసిన అధిష్ఠానం.. ఏ ఒక్క అభ్యర్థినీ ఖరారు చేయలేదు. సరికదా ప్రకటించిన నియోజకవర్గ ఇన్చార్జుల్లోనూ మార్పులు తథ్యం అని చెప్తోంది. ఇన్చార్జీల మార్పు లీకుల వ్యవహారం ఆశావహుల మధ్య డబ్బుల పందేరం పెంచడానికే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!
ఎన్నో హామీలు ఇచ్చి అధికారం పీఠం దక్కించకున్న జగన్ తాజా ఎన్నికల్లో ధన బలాన్నే నమ్ముకున్నారు. ఇప్పటికే ప్రాంతాల వారీగా తాయిలాల పంపిణీ కొనసాగుతుండగా మరో వైపు ఎమ్మెల్యే సీట్లకు వేలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్నవారి నుంచి కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
హంతకుల పార్టీకి ఓటేయొద్దు- జగనన్న పార్టీ గెలవొద్దు: వైఎస్ సునీత
పార్టీ ఆవిర్భావం నుంచి పదేళ్లుగా కష్టపడుతున్నాం. వైఎస్సార్ అంటే అభిమానంతో జగన్ వెంట నడిచాం. కానీ, మమ్మల్ని వాడుకుని కరివేపాకులా తీసేస్తున్నారు. - వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వ్యాఖ్యలివి
₹6.5కోట్లు తీసుకున్నారు : వైఎస్సార్సీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఆ పార్టీ చిలకలూరిపేట (Chilakaluripet) నియోజకవర్గ నేత మల్లెల రాజేశ్ నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోకి రావాలనుకునే సామాన్యులకు ఆందోళన కలిగిస్తున్నాయి. మంత్రి రజిని తన వద్ద ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుందని ఆరోపించారు. డబ్బుల విషయమై సజ్జలకు చెబితే 3 కోట్లు వెనక్కు ఇప్పించారని తెలిపారు. మిగతా మూడున్నర కోట్లు ఇవ్వకుండా రజని తనను మోసం చేసిన్న రాజేశ్ మర్రి రాజశేఖర్ కు టికెట్ ఇస్తే తాను 20కోట్లు ఖర్చు పెట్టకుంటానని చెప్పాడు.
వాళ్లు అధికారంలో ఉన్నంత వరకు న్యాయం జరగదు - వివేకా వర్ధంతి కార్యక్రమంలో ప్రముఖులు
₹10కోట్లు అడిగారు : వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న తనను కూడా పార్టీ అధిష్ఠానం డబ్బులు డిమాండ్ చేసిందని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ (Kurnool MP Sanjeev Kumar) వాపోయారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కోసం కనీసం 5 కోట్లు డిమాండ్ చేశారని, 10కోట్లు సమర్పించుకుంటే తప్ప సీటు దక్కే పరిస్థితి లేదని వెల్లడించారు. టికెట్ విషయంలో తనకు, సిట్టింగ్ ఎమ్మెల్యే బుట్టా రేణుక మధ్య్ డబ్బు పోటీ పెట్టే యత్నం చేశారని, తన దగ్గర అంత డబ్బు లేదని గౌరవంగా చెప్పి తప్పుకొన్నానని చెప్పారు.
నారా లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నేతలు
పుత్తూరు మున్సిపాలిటీ ఛైర్పర్సన్ (Municipality Chairperson) పదవి ఎరవేసి తన వద్ద రూ.40 లక్షలు తీసుకుని మంత్రి రోజా మోసం చేశారని ఓ దళిత మహిళా కౌన్సిలర్ ఆరోపించడం తెలిసిందే. ఎకగ్రీవంగా ఎన్నికైన తనకు చైర్మన్ పదవి ఇస్తామని మూడు విడతలుగా 40 లక్షలు తీసుకున్నారని వీడియో సాక్ష్యాన్ని ఆమె బయటపెట్టారు.
అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల