YSRCP Leaders Violated Election Code: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని ఈసీ హెచ్చరిస్తున్నా వైఎస్సార్సీపీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరులో ఇవాళ సాయంత్రం సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా సభా ప్రాంగణంలో వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. మార్కెట్ యార్డ్, హెలిప్యాడ్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ కోడ్ ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
కర్నూలు నగరంలో సిద్ధం ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. గుత్తి రోడ్డులో పెట్రోల్ బంకు వద్ద జగన్ ఫోటో ఉన్న భారీ ఫ్లెక్సీలు వేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇలాంటి ఫ్లెక్సీలు ప్రదర్శించరాదు. దీనిపై అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.