Jogi Ramesh Attend to Inquiry in Police : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ రెండోసారి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి సమయంలో జోగి రమేష్ వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్ కార్డు వివరాలు అందజేయాలని మూడు రోజుల క్రితం పోలీసులు నోటీసులు అందజేశారు. దీంతో ఆయన మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసుల నోటీసులపై జోగి రమేష్ న్యాయవాది వెంకటేశ్వర శర్మ మంగళవారం మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు అందించారు.
విచారణకు గంటన్నర ఆలస్యం: నిందితుడి నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డు వివరాలు తీసుకోవద్దని పలు కేసులలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చారని, వాటి ఉదాహరణలను న్యాయవాది వెంకటేశ్వర శర్మ పోలీసులకు అందించారు. దీనిపై సంతృప్తి చెందని పోలీసులు జోగి రమేష్ స్వయంగా వచ్చి వాటి వివరాలు అందజేయాలని మంగళవారం సాయంత్రం మళ్లీ జోగి రమేష్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ ఆయన పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణకు గంటన్నర ఆలస్యంగా హాజరైన జోగి రమేష్ అనంతరం ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు - ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ - Agri gold Land Issue
జోగి రమేష్‌ను మరోసారి విచారణకు పిలుస్తాం: జోగి రమేష్‌తోపాటు మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర శర్మ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. విచారణ పూర్తైన తర్వాత జోగి రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని మంగళగిరి డీఎస్పీ మురళీ కృష్ణ తెలిపారు. ఏం అడిగినా తెలియదు, గుర్తులేదంటున్నారని డీఎస్పీ తెలిపారు. మరోసారి ఆయనను విచారణకు పిలుస్తామని డీఎస్పీ వెల్లడించారు.
జోగి రమేష్ మంగళవారం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరవ్వాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడికి సంబంధించిన కేసులో ఇదివరకే జోగి రమేష్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి విచారణకు రావాల్సి ఉండగా జోగి రమేష్ గైర్హాజరయ్యారు. జోగి రమేష్ తరపున ఆయన న్యాయవాదులు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆయన విచారణకి రావడం లేదని స్పష్టం చేశారు.
సాయంత్రం విచారణకు రండి - జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు - Police Notices to Jogi Ramesh
"అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోనే జోగి రాజీవ్ అరెస్టు- రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటు"