YSRCP In Preparation For 7th List of Candidates: వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు సార్లు జరిగిన కసరత్తులో పలు నియోజవర్గాల్లో అభ్యర్దులను, ఇంచార్జీలను మార్పుతూ జగన్ కొత్త పేర్లను తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ మరికొన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించిన ఆయన, మరికొంత మందిని తన కార్యాలయానికి పిలుపిచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యే లు, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. అందుకో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కర్నూలు మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే మధుసూధన్‌యాదవ్ తో పాటు మరికొందరు జగన్‌ను కలిసినవారిలో ఉన్నారు.
7 వ జాబితా: వైఎస్సార్సీపీలో పలు లోక్ సభ, అసెంబ్లీ నియోజక వర్గాల ఇన్ చార్జీలను మార్పు కొనసాగుతోంది. ఇప్పటికే 6 జాబితాలు ప్రకటించి 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 8 మంది సిట్టింగ్ ఎంపీలపై వేటు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరికొంత మంది సిట్టింగ్ లపై వేటు వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. పలు మార్పులతో 7 వ జాబితాను రూపొందిస్తున్నారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేస్తున్నారు. మార్పులు చేయనున్న నియోజక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేలు నేతలు సీఎం జగన్ ను కలిశారు.
వైఎస్సార్సీపీతో వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించలేను: అంబటి రాయుడు
బాలినేని ప్రయత్నాలు: ప్రకాశం జిల్లాకు సంబంధించి పలు నియోజకవర్గాల్లో మార్పులు జరుగుతున్నాయి. దీని కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తన కుమారుడిని ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేయించేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఒంగోలు ఎంపీగా పార్టీ దాదాపుగా నిర్ణయించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి అభ్యర్థిత్వాన్ని బాలినేని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధిష్టానం మాత్రం చెవిరెడ్డిని తప్పించేది లేదని స్పష్టం చేస్తోంది. అవసరమైతే తానే ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమని బాలినేని ప్రతిపాదన పెట్టినట్లు తెలిసింది. ఈ అంశంపైనా సీఎంవోలో బాలినేని చర్చించారని తెలిసింది. పలు అసెంబ్లీ,పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతోన్న సీఎం జగన్ కసరత్తు చేశారు.
సీఎం జగన్ ఎదుటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధిక్కార స్వరం
టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని: టీడీపీ నుంచి ఎన్నికై వైఎస్సార్సీపీకి మద్దతిస్తోన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ను కలసి తన సీటు విషయమై చర్చించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం ను కలసి పలు అంశాలపై చర్చించారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను మార్చాలని యోచిస్తోన్న సీఎం, ఆయన స్థానంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై ఎస్వీ మోహన్ రెడ్డితో సీఎం చర్చించినట్లు తెలిసింది. టికెట్ కోల్పోయిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్ సీఎం జగన్ ను కలసి తనకు ఎక్కడో ఓ చోట టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరినట్లు తెలిసింది.