ETV Bharat / politics

ఐదేళ్లలో ఇల్లుపీకి పందిరేశారు- అమరావతి నిర్మాణం చంద్రబాబుకు సవాలే! - Amaravati city Construction - AMARAVATI CITY CONSTRUCTION

Construction of Amaravati city : అమరావతి పునర్నిర్మాణంలో కూటమి ప్రభుత్వానికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జగన్‌ జమానాలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అంత సులభతరం కాదని తెలుస్తోంది. నిర్దిష్ట కాలపరిమితితో సాగితేనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడనుంది.

amaravati_city_construction
amaravati_city_construction (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 18, 2024, 7:12 AM IST

Construction of Amaravati city : రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే రాజధానిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఏపీ భవిష్యత్తును ఫణంగా పెట్టి మరీ తిరోగమన చర్యలతో నాశనం చేసింది. మూడు రాజధానుల పేరుతో మొగ్గ దశలో ఉన్న అమరావతిని తన స్వార్థ ప్రయోజనాల కోసం చిదిమేసింది. అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసింది. టీడీపీ హయాంలో ముమ్మరంగా సాగిన అమరావతి పనుల్ని 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసింది. ఐదేళ్ల పాటు రాజధానిని పాడుబెట్టింది. చంద్రబాబు నేతృత్వంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అమరావతికి పూర్వవైభవం తీచ్చే చర్యలు మొదటి రోజు నుంచే ప్రారంభించింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న పట్టుదలతో మార్గసూచిని సిద్ధం చేసుకుంటోంది.

రాజధాని పునర్నిర్మాణం సీఎం చంద్రబాబుకు సవాలుగా మారనుంది. ఈ ఐదేళ్లలో ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, భవిష్యత్తులో మరొకరు జగన్‌లా విధ్వంస ఆలోచనలకు తావివ్వకుండా చూడాల్సిన అవసరం ఉందని రాజధాని రైతులు కోరుతున్నారు. ఆచరణాత్మక లక్ష్యాలు నిర్దేశించుకొని తన హయాంలోనే అందరి ఆశలు నెరవేరుస్తూ మొదటి దశను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన గురుతర బాధ్యత బాబు భుజస్కంధాలపై ఉందని చెప్తున్నారు. అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్‌మెంట్లు 72 శాతం, ఎన్జీవోల నివాస సముదాయాలు 62 శాతం, గెజిటెడ్‌ అధికారుల క్వార్టర్ల నిర్మాణం 65 శాతం మేర పూర్తయ్యాయి. పెండింగ్ పనుల్ని వెంటనే ప్రారంభించాల్సి ఉంది. కేబినెట్‌ సబ్‌కమిటీ అధ్యక్షతన ఒక హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి చర్యలపై రాష్ట్ర కేబినెట్‌ ఆమోదంతో కాలపరితితో కూడిన నివేదిక సిద్ధం చేసుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బోస్టన్‌ కమిటీ, జీఎన్‌ రావు కమిటీ, నిపుణుల కమిటీ, ఐఐటీ రూర్కీ, హై పవర్‌ కమిటీల తుది నివేదికలను సమీక్షించి తుది నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది.

అడవిలా మారిన అమరావతి ప్లాట్లు - కోర్టులు, అన్నదాతలను మోసం చేస్తున్న సర్కార్ - ysrcp govt negligence on amaravati

టీడీపీ హయాంలో ప్రారంభమైన విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాల పునాదులు ఐదేళ్లుగా పునాదుల స్థాయిలోనే నీటిలో నానుతున్నాయి. ఈ నిర్మాణాల పటిష్టతతను సాంకేతిక నిపుణులతో సమీక్షించి అంచనా వేయించాల్సి ఉంది. కట్టడాల ప్రస్తుత నాణ్యతను పరిగణలోకి తీసుకొని ఆ పనులను సవరించిన అంచనాలతో తిరిగి పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఐదేళ్లలో ఇవి పూర్తయ్యేలా చూడాలి. దీనికి గాను గుత్తేదారులకు పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, మొబిలైజేషన్‌ అడ్వాన్సులు, గడువు పొడిగింపు, ప్రస్తుత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించాలా? లేక తిరిగి టెండర్లు పిలవాలా? అనే అంశాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పెండింగ్‌ భూసేకరణ, రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయ చిక్కులను సత్వరమే పరిష్కారం చేయాలి. అనంతరం ఆ భూములను CRDAకు తిరిగి దఖలు పరిచేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. APCEDA చట్టం, పునర్విభజన చట్టం, అమరావతి బృహత్‌ ప్రణాళిక, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసేందుకు న్యాయపరమైన చర్యలను ప్రారంభించాలి. రైతుల రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేసి వీలైనంత త్వరగా లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీతో వారి ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలి. దీని వల్ల రాజధానిలో నివాసయోగ్యత స్థాయి పెరుగుతుంది.

మూడు రాజధానులంటూ రాజధానే లేకుండా చేశారు- జగన్​ను ఇంటికి పంపాల్సిందే : చంద్రబాబు - Chandrababu Slams CM YS Jagan

పెండింగ్‌ ప్లాట్లు, కేటాయించిన ప్లాట్లలో ఇంకా చేయించాల్సిన రిజిస్ట్రేషన్లు నిర్దిష్ట కాల పరిమితి తో పూర్తి చేయాలి. అమరావతిలో అత్యంత కీలకమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, మిగిలిన అనుసంధాన రహదారుల నిర్మాణం పూర్తి చేసేందుకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలి. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, హ్యాపీ నెస్ట్, తదితర ప్రాజెక్టులను సత్వరమే పునరుద్ధరించి వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలి. రాజధానిని రాయసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానిస్తే అన్ని ప్రాంతాలతో అనుసంధానత పెరుగుతుంది. NID, SRM, విట్, తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వాటిని సరిదిద్దితే మరిన్ని సంస్థలు అమరావతికి వచ్చే అవకాశం ఉంటుంది. అమరావతి ప్రణాళికలో పేర్కొన్న విధంగా అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వెంటనే పనులు ప్రారంభించి నిర్దిష్ట కాలపరిమితితో మూడు సంవత్సరాలకు మించకుండా కార్యకలాపాలు సాగించేలా, చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం వైకుంఠపురం వద్ద 40TMCల సామర్ధ్యం ఉన్న రిజర్వాయర్‌ నిర్మించాలి. రాజధాని పరిధిలోని గ్రామాలతో అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు న్యాయపరమైన చిక్కులను అధిగమించే అంశంపై దృష్టి పెట్టాలి. ఆ గ్రామాల నుంచి వసూలు చేసే పన్నులతో, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను సేవలు అందించేలా చూడాలి.

R5 జోన్‌ ఏర్పాటు రాజధానేతరులకు సెంటు స్థలాల సంతర్పణ, భూసేకరణ ప్రకటన ఉపసంహరణ పేరుతో అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ధ్వంసం చేయడంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, అడిషనల్‌ కమిషనర్‌ కట్టా సింహాచలం కీలక పాత్ర పోషించారు. వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి కొరడా ఝళిపిస్తేనే విద్రోహ పోకడలకు అడ్డుకట్ట పడుతుందని రైతులు అంటున్నారు.

అమరావతిని అంతమొందించే కుట్ర - గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణ సామగ్రి విశాఖకు తరలింపు - construction material in Amaravati

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.