ETV Bharat / politics

వివాదాస్పద సీఐ జాకీర్‌కు ఉత్తమ సేవా పతకం - సర్వత్రా విమర్శలు - YSRCP Controversy CI Zakir Hussain

YSRCP Controversy CI Got Best Service Award: విధుల్లో తీవ్ర నిర్లక్ష్యంతో పాటు వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ జాకీర్​ ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు. మంత్రి చేతుల మీదుగా ఈ అవార్టు అందుకోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

YSRCP_Controversy_CI_Got_Best_Service_Award
YSRCP_Controversy_CI_Got_Best_Service_Award (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 17, 2024, 9:37 AM IST

YSRCP Controversy CI Got Best Service Award: విధుల్లో తీవ్ర నిర్లక్ష్యంతో పాటు వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగారనే ఆరోపణలతో రాష్ట్ర డీజీ కార్యాలయానికి సరెండర్ చేసిన వివాదాస్పద సీఐ జాకీర్ హుస్సేన్ మళ్లీ బదిలీపై తిరిగొచ్చి అనంతపురం జిల్లాలో హవా నడుపుతున్నారు. మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవా పతకాన్ని అందుకున్నారు. గతంలో జిల్లా స్పెషల్ బ్రాంచి సీఐగా ఉన్న జాకీర్ అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డితో అంటకాగుతూ బాధితులపైనే అక్రమ కేసులు పెట్టినట్లు ఫిర్యాదులొచ్చాయి.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే అక్రమాలకు కొమ్ముకాస్తూ బాధితుల పైనే కేసులు పెట్టిన ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ జాకీర్ హుస్సేన్ మళ్లీ అనంతపురం జిల్లా వీఆర్​కు వచ్చేశారు. పదేళ్లకు పైగా జిల్లాను దాటి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారని జాకీర్​పై విమర్శలున్నాయి. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ సమయంలో తాడిపత్రిలో అల్లర్లు జరిగినా జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వలేదు. వివాదాస్పద డీఎస్పీ వీఎన్​కే చైతన్య తాడిపత్రికి వచ్చి అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన విషయాన్ని ఆయన గోప్యంగా ఉంచారు.

స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్​పై చర్యలు - డీజీ కార్యాలయానికి అటాచ్ - CI Zakir Hussain

దీనిపై పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేశారు. జిల్లా ఎస్పీకి, డీఐజీకి కళ్లు, చెవులుగా ఉండాల్సిన స్పెషల్ బ్రాంచిని వైఎస్సార్సీపీ నాయకుల అనుకూల విభాగంగా మార్చారని అంతర్గత విచారణలో తేలింది. దీంతో సీఐ జాకీర్‌ను 2 నెలల కిందట రాష్ట్ర డీజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అయినప్పటికీ మళ్లీ జిల్లాకు రావడమేగాక మంత్రి చేతుల మీదుగా ఉత్తమ పోలీసు సేవా పతకాన్ని సైతం అందుకోవడంపై వైఎస్సార్సీపీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డితో అంటకాగుతూ అనంతపురం టూటౌన్ స్టేషన్ పరిధిలో బాధితులపైనే కేసులు పెట్టి వేధించారని పోలీసుల విచారణలో తేలింది. ఇన్ని ఆరోపణలు ఉన్నా జాకీర్‌ను పోలీసు సేవాపతకానికి ఎంపిక చేస్తూ గత ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే పోలీసు అధికారులకు సాధారణంగా పంపించే ఈ పతకాన్ని వేదికపై మంత్రి చేతుల మీదుగా ఇప్పించడంతో పోలీసుశాఖలోనే చర్చనీయాంశమైంది. దశాబ్దానికి పైగా అనంతపురం జిల్లాలో విధులు నిర్వహించిన సీఐ జాకీర్ హుస్సేన్ మళ్లీ ఎవరి సిఫార్సుతో అనంతపురం బదిలీ చేశారని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది.

న్యాయం కోసం వెళ్తే సీఐ వేధిస్తున్నారు - చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి ఆవేదన - Land Issue CI Harassment

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.