ETV Bharat / politics

కాంగ్రెస్​ గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లాలి : షర్మిల - AP Congress Nine Guarantees

AP Congress Nine Guarantees: ఏపీలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఏపీలో సైతం 9 గ్యారెంటీలను తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. రైతులకు రెండు లక్షల వరకూ రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

ap_congress_nine_guarantees
ap_congress_nine_guarantees
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 3:43 PM IST

Updated : Mar 30, 2024, 5:10 PM IST

AP Congress Nine Guarantees : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి 10 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తుందని ఏపీసీసీ చీఫ్​ షర్మిల తెలిపారు. ప్రతి మహిళకూ ఏడాదికి లక్ష ఇచ్చేలా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో గడప గడపకు కాంగ్రెస్​ కార్యక్రమం కోసం నేతలు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు పల్లం రాజు, రఘు వీరారెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ గ్యారెంటీలకు సంబంధించిన పోస్టర్​ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్​ 9 గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ- ఇప్పుడు డ్రగ్స్‌ క్యాపిటల్​గా మార్చేశారు: వైఎస్ షర్మిల రెడ్డి - Sharmila on Visakha Drug Case

మహిళలకు ఏడాదికి లక్ష: ప్రతి నెలా 8500 చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చేలా మహిళా మహాలక్ష్మి పథకం ఉంటుందన్నారు. రైతులకు రెండు లక్షల వరకూ రుణ మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నామన్నారు. స్వామి నాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తూ పెట్టుబడిపై యాబై శాతం అధికంగా కొత్త మద్దతు ధర ఇచ్చే పథకం అమలు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం కింద కనీసం 400 రూపాయల చెల్లిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఆరో గ్యారెంటీగా ఇస్తామన్నారు.

నిరుపేదలకు ఇళ్లు: జగన్ అమ్మఒడి అని ఇద్దరు బిడ్డలకు ఇస్తామని మోసం చేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్కరికీ అది కూడా తగ్గించి ఇచ్చారన్నారు. జగన్ ప్రభుత్వంలో ధరలు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు దారుణంగా పెంచారన్నారు. యువతకు 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేలా మరో గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇస్తోందన్నారు. రాష్ట్రంలోనే 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదేనని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లనిర్మాణానికి గ్యారెంటీ ఇస్తుందన్నారు. పెన్షన్​ను అర్హులైన వృద్ధులకు అందరికీ 4 వేల రూపాయలు ఇచ్చేలా మరో గ్యారంటీని కాంగ్రెస్ హామీ ఇస్తోందని షర్మిల రెడ్డి తెలిపారు.

అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా: వైఎస్ షర్మిల - YS SHARMILA COMMENTS ON CONTEST

కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్య యుతంగానే ఉంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి తెలిపారు. ప్రాంతీయ పార్టీ తరహాలో ఎంపిక జరగదని అన్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీ అధికారంలో లేకపోతే మణిపుర్ లాంటి ఘటనలే జరుగుతాయని అన్నారు. బీజేపీ తప్పులపై తప్పులు చేసుకుంటూ వెళ్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ఇంటింటికీ తీసుకెళ్లేలా గడపగడపకు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

కాంగ్రెస్​ గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లాలి : షర్మిల

జగన్ మోదీకి దత్త పుత్రుడు: వైఎస్సార్సీపీ, టీడీపీలు మోదీకి బానిసలుగా మారాయని షర్మిల ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం ఇలా ఏ విషయంలోనూ ఏపీకి న్యాయం జరగలేదని అన్నారు. రెండు పార్టీల్లో ఒకరిది ప్రత్యక్షం, మరొకరిది పరోక్ష పొత్తులన్న షర్మిల, ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే అవి బీజేపీకి వేసినట్టేనన్నారు. జగన్ మోదీకి దత్త పుత్రుడని ఎద్దేవా చేశారు.

ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని వ్యాఖ్యానించారు. పదేళ్ల ప్రత్యేక హోదా గ్యారెంటీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. బీజేపీ ఏపీకి వెన్నుపోటు పొడిచిందని అన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీలు పదేళ్లుగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామాలని చెప్పి డ్రామా చేశారని విమర్శించారు. 23 మంది వైసీపీ ఎంపీలు ఒక్కరోజు కూడా హోదా గురించి మాట్లాడటం లేదన్నారు. జగన్ రాష్ట్రాన్ని ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. ఏపీకి పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాలేదని, ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా మూత పడ్డాయన్నారు.

'రాష్ట్రానికి రాజధాని ఏదీ ? - ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఐక్య పోరాటాలు' - Sharmila fire on BJP

అందరికీ టికెట్​లు కష్టం: ఏప్రిల్ ఒకటో తేదీన రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రఘువీరారెడ్డి తెలిపారు. మొత్తం 1500 మంది అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేస్తే కేవలం 200 మందికి మాత్రమే టికెట్​లు వస్తాయన్నారు. మిగతా 1300 వందల మందికి టికెట్ రాదు అన్న వాస్తవం గుర్తుకు పెట్టుకోవాలన్నారు. అంతా కలిసి పని చేయాలని, ఇక వారంతా గడపగడపకు తిరగాలని సూచించారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టిందని రఘువీరారెడ్డి తెలిపారు. అధికారంలోకి వస్తే ఏపీలో గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేసి తీరుతుందని స్పష్టంచేశారు. దిల్లీలో ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఇండియా కూటమి అధికారం చేపట్టబోతోందని రఘువీరారెడ్డి తెలిపారు.

జగన్ ప్రభుత్వం బీజేపీకి పూర్తిగా సాగిలపడింది: మోదీ ప్రభుత్వం స్వయంప్రతిపత్తితో పని చేయాల్సిన సంస్థలను అణచివేసేందని పల్లంరాజు ఆరోపించారు. ఎన్నిక కమిషన్, రిజర్వు బ్యాంకు, ఈడీ, మీడియా ఇలా వేర్వేరు విభాగాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఐదు కీలకమైన అంశాల ఆధారంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని అన్నారు. ఐదు హామీలు రైతులకు, మహిళలు, యువత గురించి ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు గురించి ప్రస్తావిస్తూ మేనిఫెస్టో విడుదల చేశారు.

2021లో జరగాల్సిన జనగణన జరగలేదని, ఆ వివరాలు వస్తే అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో తెలిసేదని అన్నారు. 14 లక్షలు నగదుగా జమ చేశారని కాంగ్రెస్​కు చెందిన 200 కోట్లు ఫ్రీజ్ చేశారని, కానీ వేల కోట్లను నగదు తీసుకుంటున్న బీజేపీని ఎవరూ ఏమీ అనరా అని ప్రశ్నించారు. ఆదాయపు పన్ను విభాగం కూడా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం బీజేపీకి పూర్తిగా సాగిలపడిందని పల్లంరాజు అన్నారు.

తులసిరెడ్డితో సునీత దంపతుల భేటీ - కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ! - YS Sharmila to Contest as Kadapa MP

Last Updated : Mar 30, 2024, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.