ETV Bharat / politics

జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్: వైఎస్‌ షర్మిల

షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవు - ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు 32 కోట్లు విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే

Sharmila
Sharmila (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

YS Sharmila on Jagan Bail : వైఎస్‌ విజయమ్మ బహిరంగ లేఖ రాయకపోతే ఆ లేఖతో సంబంధం లేదని, అది ఆమె రాయలేదని ఖండించే వారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు తాము కుట్ర చేస్తున్నామనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని విమర్శించారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదని, 32 కోట్లు విలువ చేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే అని గుర్తు చేశారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ, వాటి షేర్లు, స్టాక్ మార్కెట్​లో ట్రెండింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని గుర్తు చేశారు.

బెయిల్ రద్దు అవుతుందని తెలియదా? : 2016లో ఈడీ, భూములను అటాచ్ చేసినందు వల్ల షేర్ల బదిలీ చేయకూడదని జగన్‌ వింతగా చెప్పడం హాస్యాస్పదమని షర్మిల అన్నారు. 2019లో తనకు 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ ఎమ్ఓయూ మీద సంతకం చేశారని, అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని ఆమె ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్​కి చెందిన సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు విజయమ్మకు ఎలా అమ్మారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదా అని నిలదీశారు. 2021లో జగన్, భారతి రెడ్డి తమ షేర్స్​పై సంతకం చేసి, విజయమ్మకి ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని, ఇచ్చే ముందు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని ప్రశ్నలు సంధించారు.

'జరగకూడనివన్నీ జరిగిపోతున్నాయి' - వైఎస్సార్​ అభిమానులకు విజయమ్మ బహిరంగలేఖ

విజయమ్మకి తెలుసు : షేర్ల బదిలీకి, బెయిల్ రద్దుకు సంబధం లేదని జగన్‌కు కూడా తెలుసు కాబట్టే అప్పుడు సంతకాలు చేశారని, ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్​సీఎల్​టీలో కేసు ఉంది కాబట్టి షేర్ల గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని, కొడుకు బెయిల్​కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మకి తెలుసని షర్మిల పేర్కొన్నారు.

వైఎస్ విజయమ్మ లేఖపై జగన్ వర్రీ !

ఐదేళ్లు మీరు గాడిదలు కాశారా ? ఛార్జిషీట్​లో వైఎస్ పేరు చేర్పించింది జగన్ కాదా?-విజయసాయి రెడ్డికి షర్మిలా కౌంటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.