YS Sharmila Allegations on CM Jagan: వైసీపీ ప్రభుత్వం సిద్ధం సభలు నిర్వహిస్తూ రాష్ట్ర ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఒక్కో సభకు 90 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఇప్పటికీ వరకు సిద్ధం సభల కోసం సీఎం జగన్ 600 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని విజయవాడ ఆంధ్రరత్నా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలోని యువకులకు న్యాయం జరగడం లేదని ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
తల్లిలాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు - ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి : షర్మిల
ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన మాట మరిచారని దుయ్యబట్టారు. ఏపీపీఎస్సీ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని కాని ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేశారని నిలదీశారు. ఇచ్చిన హామీల్లో రెండు శాతం కూడా భర్తీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ చేశారని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి కావాల్సిన వాళ్లకు మాత్రమే వాలంటీర్ల పేరు చెప్పి ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయక పోతే జగన్ పెద్ద పెద్ద మాటలు చెప్పారని కాని ఇప్పుడు ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇవ్వకుంటా ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అని మండిపడ్డారు.
గుట్టల్ని కొట్టడం, పోర్టులు అమ్మడం, భూములు దోచేయడమే వైసీపీ విజన్: షర్మిల
తాము నిలదీస్తే మమ్మల్ని తీవ్రవాదుల్లా చూశారని గృహనిర్భందాలు చేసి అక్రమంగా అరెస్టులు చేశారన్నారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉంటి ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ యువత న్యాయం కోసం ఒక మ్యానిఫెస్టో ఇచ్చిందనని భర్తీ బరోసా స్కీమ్ ద్వారా దేశంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ అవుతాయని హామీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనే దానిపై చర్చ జరిగిందని అన్ని అంశాలను పరిశీలన చేస్తున్నామని తెలిపారు.
ఓట్ల కోసం జగనన్న హామీలిస్తాడు - అమలు మాత్రం చేయడు: వైఎస్ షర్మిల
బీజేపీ, జనసేన- తెలుగుదేశం పొత్తులు అనైతికమని విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణిది కనిపించే పొత్తు అయితే జగన్‌ది బీజేపీతో కనిపించని పొత్తని బీజేపీకి వారసుడిగా జగన్ పనిచేస్తున్నారని షర్మిల విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారని షర్మిల ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీతో టీచర్ డీఎస్సీ అభ్యర్థులను దగా చేశారన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్షాలను వైసీపీ అణచివేస్తూ నియంత ధోరణి అవలంభిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.