ETV Bharat / politics

వైఎస్ పేరును సీబీఐ చార్జీషీట్​లో చేర్పించింది జగనే: షర్మిల - YS Sharmila on CM Jagan

YS Sharmila Allegations against CM Jagan: వైఎస్ఆర్ పేరును సీబీఐ చార్జీ షీట్​లో చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసుల నుంచి బయట పడేసేందుకే జగనే వైఎస్ఆర్ పేరును చార్జిషీట్​లో చేర్పించారని అన్నారు. జగన్ రెడ్డి వైఎస్ వారసుడు కాదు మోదీ వారసుడని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేేశారు.

sharmila_on_jagan
sharmila_on_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 10:47 PM IST

YS Sharmila Allegations against CM Jagan: సీఎం సొంతచెల్లెలు మీద ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వేలమంది సభలో రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదని ఆగ్రహించారు. జగన్ రెడ్డి వైఎస్ వారసుడు కాదు మోదీ వారసుడని అన్నారు. క్రైస్తవులను చంపుతుంటే మోదీకి మద్దతు పలికాడని అన్నారు. మీకోసం పరితపించిన వాళ్లు ఇవ్వాళ మీ వెనకా ముందు ఉన్నారో చూస్కోండని అన్నారు. జగన్ రెడ్డితో చెల్లెళ్లు ఎవరు లేరని వైఎస్​ని తిట్టిన రోజా,రజినీ ఇప్పుడు జగన్​కి చెల్లెళ్లు అయ్యారని అన్నారు. అసెంబ్లీ వేదికగా వైఎస్​ను తిట్టిన వాళ్లు ఈయనకు బంధువులని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినాష్​రెడ్డి చిన్నపిల్లాడు- అందుకే టికెట్ ఇచ్చా! చెల్లెళ్లపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ - YS Jagan Nomination

సీబీఐ వైఎస్ఆర్ పేరును చార్జీ షీట్ లో చేర్చలేదని చార్జీషీట్లో చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి లాయర్ అని షర్మిల ఆరోపించారు. కేసు నుంచి జగన్​ను బయట పడేసేందుకు వైఎస్ఆర్ పేరును చార్జిషీట్​లో చేర్పించారని అన్నారు. సుధాకర్ రెడ్డి అనే లాయర్​తో హై కోర్టులో చేర్పించారని తెలిపారు. ప్రతిఫలంగా అదే సుధాకర్ రెడ్డికి జగన్ అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారని ఆరోపించారు. ఇది వాస్తవం కాదా దీనిపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని తిట్టిపోసే మీరు ఆలోచన చేసుకోండని అన్నారు. సౌభాగ్యమ్మ లెటర్ రాస్తే కనీసం స్పందన లేదు మీ ఛాతిలో ఉన్నది గుండెనా లేక బండనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చిన్నాన్నను హత్య చేసిన వారిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని అన్నారు.

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల రాళ్లదాడి - తిరుపతిలో ఉద్రిక్తత - YCP Activists Attack TDP Activists

హంతకులను రక్షిస్తూ వాళ్లకే ఎంపీ టిక్కెట్లు ఇచ్చారని షర్మిల ఆరోపించారు. జగన్ ఇవ్వాళ పులివెందులో వివేకానంద రెడ్డి ప్రస్తావన తీశారు కాని ఒక్క మంచిమాట కూడా జగన్ నోట నుంచి రాలేదని విమర్శించారు. వివేకాకు రెండో పెళ్లి అయ్యిందట ఇంకో సంతానం ఉందని చెప్పారు కాని అదే వివేకా ప్రజా నాయకుడు అని గానీ వైఎస్ఆర్​కి తమ్ముడు అని కాని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. వీళ్లు వివేకా గురించి మాట్లాడొచ్చు మేము మాట్లాడకూడదు అని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాష్ రెడ్డి చిన్నవాడు అంట మంచోడు అంట ఆయన భవిష్యత్ పాడు చేస్తున్నమట అని అన్నారు. వివేకా అవినాష్​ను వద్దు వద్దు అన్నా మేము కాదు అనలేదని వివేకా హత్య రోజు మేము అవినాష్ రెడ్డి నిందితుడు అని చెప్పలేదు కదా అని అన్నారు.

ఐదేళ్లుగా మాట్లాడకుండా వివేకాపై విద్వేషం ఎందుకు జగనన్నా?: సునీత - Sunita Fire on Jagan

జగన్ ఎందుకు అవినాష్ రెడ్డిని గుడ్డిగా నమ్ముతున్నారని షర్మిల ప్రశ్నించారు. మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా ఆలోచన శక్తి లేదా అని ఆగ్రహించారు. సీబీఐ అన్ని ఆధారాలు చూపిస్తుంటే జగన్​కు కనపడటం లేదా అని ప్రశ్నించారు. మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. జగన్ అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి చానెల్​లో వివేకా హత్యను గుండెపోటుగా చూపించారని అన్నారు. అధికారంలో లేనప్పుడు సీబీఐ దర్యాప్తు కావాలని అడిగారు కాని అధికారంలో వచ్చాకా దర్యాప్తు వద్దు అన్నారని షర్మిల అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.