YSRCP Leaders Joined TDP in Vizianagaram District : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీని వీడి టీడీపీలోకి భారీగా వలసపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో భారీ ఎత్తున ప్రజలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో అంతకాపల్లి గ్రామానికి చెందిన 150 కుటుంబాలు, బొద్దాం గ్రామానికి చెందిన 80 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. వీరందరికి మురళీ మోహన్ టీడీపీ కండువా వేసి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు.
ఉరవకొండలో వైఎస్సార్సీపీని వీడుతున్న శ్రేణులు- టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు
సంక్షేమానికి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని కోండ్రు మురళీ మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ సైకో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి సాగనంపుదామా అని ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. నియంత సీఎం జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లి పోయిందన్నారు. కేవలం రాష్ట్రంలో అక్రమ కేసులు దాడులతో రాష్ట్రాన్ని పరిపాలిస్తురని పేర్కొన్నారు.
స్వతంత్ర భారత దేశ చరిత్రలో జగన్ రెడ్డి పాలనలో జరిగినంత ద్రోహం, దగా, దారుణాలు ఎవరి పాలనలో కూడా జరగలేదని మురళీమోహన్ ధ్వజమెత్తారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్‌కి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. అయిదేళ్ల నరకానికి స్వస్తి పలికేందుకు రాష్ట్రంలోని ప్రజలంతా ఉమ్మడిగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్ సిక్స్ పథకాలు, బీసీ డిక్లరేషన్లపై రాష్ట్ర ప్రజానీకం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
Prakasam District : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లిలో వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామ సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బమ్మతో సహా 250 మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నేత ముత్తుముల అశోక్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ముత్తుముల అశోక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
YSR District : వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రోజురోజుకు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. కమలాపురానికి చెందిన పుత్తా భాస్కర్ రెడ్డి అనుచర వర్గం నుంచి 40 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. పుత్తా నర్సింహారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తనను నమ్మి వచ్చినా కుటుంబాలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
సూపర్ సిక్స్' ఎఫెక్ట్ టీడీపీలోకి భారీగా చేరికలు - సీఎం సొంత జిల్లాలో వైసీపీకి భారీ షాక్