ETV Bharat / politics

విడదల రజిని, మురుగుడు లావణ్య కిడ్నాప్ - నామినేషన్ అడ్డుకున్న వైఎస్సార్​సీపీ - Vidadala Rajini Kidnapped - VIDADALA RAJINI KIDNAPPED

Vidadala Rajini Kidnapped : ఎన్నికల నామినేషన్ల చివరి రోజున ఏపీలోని గుంటూరులో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. నామినేషన్లు వేయకుండా పలువురు అభ్యర్థులను వైసీపీ నేతలు అపహరించారు. ఈ ఘటనలపై బాధిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ వైఎస్సార్​సీపీ నేతలు ప్రలోభాలకు గురి చేసినా, తాము లొంగకపోవడంతోనే కిడ్నాప్​లకు బరితెగించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections 2024
Vidadala Rajini Kidnapped
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 25, 2024, 6:12 PM IST

Vidadala Rajini Kidnapped: ఒకే పేరు మీద ఉన్న అభ్యర్థులు పోటీ చేస్తుంటే, వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు. వారిని నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్నారు. అంతటితో ఆగకుండా వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ, అపహరించడానికి సైతం వెనకాడటం లేదు. అందులో భాగంగా నామినేషన్లకు చివరి తేదీన ఏపీలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గుంటూరు పశ్చిమ, మంగళగిరి ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించిన మహిళలను అపహరించిన ఘటనలు సంచలనం రేపుతున్నాయి.

మంగళగిరిలో పోటీ చేయకుండా: ఏపీలో నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున గుంటూరులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్లు వేసేందుకు యత్నించిన ఇద్దరు స్వతంత్ర మహిళా అభ్యర్థులను అధికార పార్టీ నేతలు నిర్బందించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మురుగుడు లావణ్య అనే మహిళ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించింది. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఆమెను గృహ నిర్బంధం చేశారు. సమాచారం అందుకున్న టీడీపీ నేతలు మురుగుడు లావణ్య నివాసముంటున్న టిడ్కో నివాసాల వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతలు పెద్ద ఎత్తున టిడ్కో నివాసాల వద్దకు రావడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి.

టీడీపీ నేతల రాకతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రోడ్డుపై ఉన్న టీడీపీ నేతలను పోలీసులు బలవంతంగా బయటికి పంపించేశారు. అదే సమయంలో వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారు. మురుగుడు లావణ్య నివాసంలో ఉన్న వైసీపీ నేతలను పోలీసులు బయటకు పంపకపోగా, వారికి కాపలాగా ఉన్నారు. పోటీ చేయవద్దంటూ వైసీపీ నేతలు లావణ్య కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన వాహనాలను అక్కడికి పంపించారు. లావణ్యతో పాటుగా ఆమె కుటుంబ సభ్యులను వెనక దారి నుంచి కారులో తరలించారు. ఈ తతంగం అంతా పోలీసులు గమనిస్తున్నా, చూసీచూడనట్లు ఉండిపోయారు. పైగా టీడీపీ నేతలు, కారకర్తలు అటువైపుగా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని పట్టణ సీఐ శ్రీనివాసరావు దగ్గరుండి పర్యవేక్షించారు.

గుంటూరు పశ్చిమ అపహరణ కేసు: గుంటూరు నగరంపాలెం పీఎస్‌ పరిధిలో మహిళ అపహరణ కేసు నమోదైంది. తన భార్యను అపహరించారంటూ నగరంపాలెం పీఎస్‌లో ఏసుభుక్త నగర్‌కు చెందిన అను రాఘవరావు ఫిర్యాదు చేశారు. విడదల రజని అనే మహిళ గుంటూరు పశ్చిమకు నామినేషన్‌ వేయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో తన భార్య నామినేషన్ వేయకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారని రాఘవరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్యను కారులో తీసుకెళ్లినట్లు చెబుతున్నట్లు వెల్లడించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

"రోడ్లు గిట్లుంటే ఓట్లెట్ల పడ్తయ్ సామీ" - ఏపీ రహదారుల దుస్థితిపై మంత్రి తుమ్మల రియాక్షన్ - TS MINISTER ON AP DAMAGED ROADS

సీఎం జగన్ ఆస్తులు రూ. 529 కోట్లు - చేతిలో రూ. 7 వేలు మాత్రమే - AP CM JAGAN ASSETS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.