ETV Bharat / politics

కళా పిపాసి రామోజీ- ఉషా కిరణ్‌ మూవీస్‌ బ్యానర్​పై వినోదాత్మక, సందేశాత్మక చిత్రాలెన్నో - Ramoji Film City

Ramoji Rao has built Ramoji Film City : 'ఈ ఉషా కిరణాలు' అంటూ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ఆ గీతాన్ని వినని తెలుగువాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఉషా కిరణ్‌ మూవీస్‌ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు రామోజీరావు.

ramoji_rao_has_built_ramoji_film_city
ramoji_rao_has_built_ramoji_film_city (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 2:33 PM IST

Ramoji Rao has built Ramoji Film City : ఉషా కిరణ్‌ మూవీస్‌ బ్యానర్, మయూరి ఫిలిం డిస్ర్టిబ్యూటర్స్‌ని ప్రారంభించి కొన్ని వందల తెలుగు చిత్రాలనే కాకుండా, ఇతర భాషా చిత్రాలు కూడా పంపిణీ చేశారు. సినిమా షూటింగులకు అత్యంత అనువైన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు. ఆ మహానీయుడు మరణం సినీ లోకానికి తీరని లోటు.

రైతుబిడ్డగా మొదలై మీడియా మహాసామ్రాజాన్ని నిర్మించిన యోధుడు రామోజీ రావు - Ramoji Rao Biography

సినిమా అనేది కళాత్మాక వ్యాపారం అని నమ్మిన వ్యక్తి రామోజీ రావు. అశ్లీలతకు దూరంగా మంచి వినోదాత్మక, సందేశాత్మక కథ చిత్రాలను నిర్మించాలన్న.. సంకల్పంతో ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను ఏర్పాటు చేశారు. తన తుదిశ్వాస వరకు అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్న దార్శనికుడు రామోజీరావు. తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందించాలనే సంకల్పంతో 1983 మార్చి 2న ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను ఏర్పాటు చేశారు. విలువలున్న చిత్రాలను అందించాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా.. తారాబలం కాకుండా కేవలం కథను మాత్రమే విశ్వసించి 85కుపైగా చిత్రాలను నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్‌లో అవకాశమంటే మార్కెట్‌లో క్రేజ్‌ ఉన్న ఏ కథనాయకుడైనా టక్కున కాల్షీట్లు ఇచ్చేవారు. కానీ రామోజీరావు మాత్రం తారలను సృష్టించే కథలను నమ్మారు. అలా 1984లో దిగ్గజ హాస్య దర్శకుడు జంధ్యాల గారి దర్శకత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్న.. నరేష్‌, పూర్ణిమతో శ్రీవారికి ప్రేమలేఖని నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో మెుదటి చిత్రం తోనే తెలుగు సినిమాతోనే తనదైన ముద్ర వేశారు.

కథలనేవి కల్పనల్లోంచి కాదు, జీవితాల్లోంచి పుడతాయని ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థ నిరూపించింది. అందుకు ఉదాహరణే మయూరి సినిమా. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి సంచలనం సృష్టించారు. ప్రమాదంలో కాలు పొగొట్టుకొని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్‌ జీవితాన్ని తెరపై ఆవిష్కరించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. మయూరి చిత్రంతోనే జైపూర్‌ పాదం గురించి దేశంవ్యాప్తంగా ప్రజలకు తెలిసింది. ఒడిశాలో జరిగిన యధార్థ సంఘటనలతో మౌనపోరాటం, జాతీయ క్రీడాకారణి అశ్వని నాచప్ప బయోపిక్‌ అశ్వని.. వంటి చిత్రాలను నిర్మించి ఆయన అభిరుచి వేరు అని నిరూపించుకున్నారు. కాంచన గంగ, ప్రతిఘటన, నువ్వేకావాలి, చిత్రం, ఆనందం, నచ్చావులేవంటి ఎన్నో హిట్‌ చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగు చిత్రాలకే ఉషా కిరణ్‌ మూవీస్ పరిమితం కాలేదు. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషాల్లో ఇప్పటివరకు 85 చిత్రాలను నిర్మించింది.

'మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు'- రామోజీ అస్తమయంపై ముర్ము, మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - Modi On Ramoji Rao Demise

మంచి చిత్రాలకు ప్రేక్షక ఆదరణే కాదు, అవార్డులు సైతం తలవంచుతాయని రామోజీ రావు గారు నిరూపించారు. శ్రీవారి ప్రేమలేఖకు ప్రభుత్వ పురస్కారాలు వరించాయి. కాంచన గంగ, మయూరి, ప్రతిఘటన, తేజ, మౌనపోరాటం లాంటి చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. మయూరిలో నటించిన సుధా చంద్రన్‌కు ఏకంగా జాతీయస్థాయిలో పురస్కారం దక్కింది. నువ్వే కావాలికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటులు ఎంతో మంది ఉన్నారు. శ్రీకాంత్‌, వినోద్ కుమార్‌, చరణ్ రాజ్‌, యమున, జూ. ఎన్టీఆర్‌, ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌, కల్యాణ్ రామ్‌, రీమాసేన్‌ , శ్రియ, జెనీలియా, తనీశ్‌ ఇలా ఎందరో నటులు పరిచమయ్యారు. మౌనపోరాటంతో గాయని ఎస్‌. జానకిని సంగీత దర్శకురాలని చేశారు. గాయకులు మల్లికార్జున్‌ , ఉష, గోపికా పూర్ణిమ లాంటి వారిని శ్రోతలకు పరిచయం చేశారు.

కేవలం పెద్ద తెరకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. ఈటీవీ ద్వారా పలు సీరియల్స్ నిర్మించి ఎంతోమందిని స్టార్‌లను చేశారు. భాగవతం, అన్వేషిత, ఎండమావులు, ఆడపిల్ల , నాగాస్ర్తం, అంతరంగాలు వంటి పలు హిట్‌ ధారవాహికలను అందించారు. పాడుతా తీయగా జబర్దస్త్‌, ఢీ వంటి ప్రోగ్రామ్స్‌ను అందించారు.

'ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది'- రామోజీ అస్తమయంపై సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - Ramoji Rao Passed Away

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.