ETV Bharat / politics

కూలిన బ్రిడ్జిలకు వార్షికోత్సవం - చంద్రగిరిలో సుధాకర్‌ యాదవ్‌ వినూత్న నిరసన - Collapsed Bridges in Chandragiri

Three Year Anniversary Event for Collapsed Bridges in Tirupati District : గజమాలతో బ్రిడ్జిని అలంకరించి, బాణసంచాలు, డప్పుల మోతలతో రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ సుధాకర్​ యాదవ్​ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ పాలన మాకొద్దు బ్రిడ్జిలే ముద్దు అంటూ ఫ్లకార్డులతో నిరసన చేశారు.

collapsed_bridge_celebration
collapsed_bridge_celebration
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 7:46 PM IST

Three Year Anniversary Event for Collapsed Bridges in Tirupati District : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్​ సుధాకర్​ యాదవ్​ వినూత్న కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరిలో మూడేళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోయిన వంతెనకు మూడేళ్ల వార్షికోత్సవ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిగురువాడ ప్రధాన వంతెన దగ్గర బాణసంచాలు, డప్పుల మోతలతో హోరెత్తించారు.

కూలిన బ్రిడ్జిలకు వార్షికోత్సవం - చంద్రగిరిలో సుధాకర్‌ యాదవ్‌ వినూత్న నిరసన

నత్తనడకన రైల్వే వంతెన నిర్మాణం - మూడు జిల్లాల ప్రయాణికుల పాట్లు

State OBC Forum Convener Sudhakar Yadav : మూడేళ్ల క్రితం కూలిపోయిన బ్రిడ్జికి గజమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుధాకర్​ యాదవ్​ అనుచరులు నినాదాలు చేశారు. ఈ పాలన మాకొద్దు బ్రిడ్జిలే ముద్దు అంటూ ఫ్లకార్డులుతో నిరసన చేశారు. బ్రిడ్జి కూలి మూడవ వార్షికోత్సవం సందర్భంగా కేక్​ కట్​ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డిలో చలనం లేకపోవడంతో ఆయనకు కనువిప్పు కోసం, ప్రజలకు తెలియజేసేందుకు 3 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కృష్ణాజిల్లాలో కూలిన వంతెన - ఇసుక లారీ వెళ్తుండగా ఘటన

Tirupati District : ఎన్నికల్లో ఓట్ల కోసం కుక్కర్లు, వాచీలు పలు తాయిలాలపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధి కోసం వెచ్చినట్లయితే చంద్రగిరి నియోజక వర్గం అభివృద్ధి చెంది ఉండేదని సుధాకర్​ పేర్కొన్నారు. నియోజక వర్గం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా నిధులు లేవని అనే ఎమ్మెల్యే తాయిలాలు పంచడానికి ఎక్కడ నుంచి తీసుకు వచ్చారని ప్రశ్నించారు. తుమ్మలగుంట చెరువులో రూ. 100 కోట్ల ప్రజాధనాన్ని అనవసరంగా వెచ్చించారని మండిపడ్డారు. ఈ విషయంలో గ్రీన్​ ట్రిబ్యునల్​ చీవాట్లు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తుమ్మలగుంట చెరువు కోసం వెచ్చిన నిధులు కూలిన పోయిన బ్రిడ్జిలపై పెట్టిన నియోజక వర్గం అభివృద్ధి చెంది ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుటికైనా నియోజక వర్గ అభివృద్ధి పైన, బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు.

జగనన్న హయాంలో మరమ్మతులకు నోచుకోని వంతెనలు - ప్రమాదకరమని తెలిసినా కొనసాగుతున్న రాకపోకలు
Chiguruwada Bridge : 2021 సంవత్సరంలో తిరుపతిలో భారీ వర్షాలు కురవడం వల్ల చిగురువాడ సమీపంలో ఉన్నా వంతెన కూలిపోయింది. అందుకు ప్రత్యామ్నాయంగా పక్కన రోడ్డు వేశారు. ఇంకా అంతే ఆ వంతెన గురించి అధికారులు, నాయకులు ఎవరు పట్టించుకోవడమే లేదు. ఈ వంతెనతో పాటు మరో 5 వంతెన గురించి ఆలోచన కూడా చేయడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో తీవ్ర ఇబ్బందులతో వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడైనా అధికారులు మేల్కొని కూలిపోయిన వంతెనలు పునర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.