ETV Bharat / politics

బీఆర్​ఎస్​పై 'దీపావళి' బాంబ్​ - మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు - PONGULETI COMMENTS ON BRS

బీఆర్​ఎస్​ హయాంలో నాలుగైదు కుంభకోణాలు - హైదరాబాద్​లో దిగేలోపే బహిర్గతం

Telangana Minister Ponguleti Comments On BRS
Telangana Minister Ponguleti Comments On BRS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2024, 7:18 PM IST

Updated : Oct 24, 2024, 7:27 PM IST

Telangana Minister Ponguleti Comments On BRS : పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపు టపాసులా పేలుతుందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని ఫోన్‌ ట్యాపింగ్‌, ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. వారిని అరెస్టు చేయాలా? లేదా జీవిత కాలం జైళ్లో పెట్టాలా? అనేది చట్టం చూసుకుంటుందని మంత్రి తెలిపారు.

ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందన్న పొంగులేటి, అది ప్రభుత్వ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి వారు ఫలితాలు అనుభవించారని ఆరోపించారు. నాలుగో రోజు దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రాష్ట్ర ప్రతినిధుల బృందం, మూసీ సుందరీకరణ తదితర అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేస్తుంది.

'ఈ పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నా' - అధిష్ఠానం పెద్దలకు ఎమ్మెల్సీ లేఖ

"గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారు. కొందరు డబ్బులకు ఆశపడి ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంది. మేము సియోల్‌ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే పేలుతుంది. అరెస్టు చేయాలా, జీవిత కాలం జైళ్లో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుంది. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుంది. మా నిర్ణయం కాదు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారు. చట్టాలు అతిక్రమించిన వారు ఫలితాలు అనుభవిస్తారు." - తెలంగాణ మంత్రి పొంగులేటి

సియోల్​ నగరంలో హాన్​ నది సందర్శన : దక్షిణ కొరియాలో గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు పర్యటిస్తున్నారు. అధికారులు ఆ దేశ రాజధాని సియోల్‌లో ముఖ్యమైన హాన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్​ను ఇటీవల సందర్శించారు. అక్కడ కాలుష్యంలో ఉన్న హాన్ నదిని దక్షిణ కొరియా శుభ్రపరచి మంచి నీటి సరస్సుగా పునరుద్దించింది. ప్రక్షాళన తర్వాత హాన్ నది ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా, జల వనరుగా ఏర్పడింది. ఈ క్రమంలో హాన్ నదిని గమనించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దశల వారీగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామని, పరీవాహకంలో నివసించే ప్రతి పేదవాడికీ న్యాయం చేస్తామని తెలిపారు.

'జగన్‌ ఆస్తులను జాతీయం చేసి ప్రజలకు పంచాలి - భూ కేటాయింపులు రద్దు చేయాలి'

"ఆలోచన, ప్రవర్తనలో మార్పు వస్తే ప్రేమ పునరుద్ధరిస్తా" - షరతులు వర్తిస్తాయన్న జగన్‌

Last Updated : Oct 24, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.