Bhatti Vikramarka Introducing Telangana Budget 2024 : రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రకటించారు. కీలక రంగాలైన వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.29,816 కోట్లు, నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో భట్టి బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక అప్పు పదిరెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్ అని స్పష్టం చేశారు. దుబారా తగ్గించాం, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు.
- రూ.2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్
- రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు
- మూలధన వ్యయం రూ.33,487 కోట్లు
- వ్యవసాయం రూ.72,659 కోట్లు
- ఉద్యానవనం రూ.737 కోట్లు
- పశుసంవర్థకం రూ.1,980 కోట్లు
- రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం రూ.723 కోట్లు
- గృహజ్యోతి పథకం రూ.2,418 కోట్లు
- ప్రజాపంపిణీ కోసం రూ.3,836 కోట్లు
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.29,816 కోట్లు