Telangana Cabinet Meeting On March 12th 2024 : రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 12న భేటీ కానుంది. సచివాలయంలో ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు రూ.2,500 పథకంపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాలను ఆమోదించనున్నట్లు సమాచారం.
ఈ నెల 13న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గం పలు సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మేడిగడ్డ కుంగిబాటుపై విజిలెన్స్ సిఫార్సుల మేరకు క్రిమినల్ కేసుల నమోదు లేదా విశ్రాంతి జడ్జిలతో విచారణ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
'ఇందిరమ్మ ఇళ్లు'పై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ గృహాలకు కేంద్రం సాయం తీసుకోవాలని యోచన
ఆదాయ, వ్యయాలపై వాస్తవిక అంచనాలతో ఓట్ ఆన్ ఆకౌంట్ బడ్జెట్ - సంక్షేమానికి గ్యారంటీ!