Nara Lokesh fired on CM Jagan in Sankharavam Sabha : అక్రమ కేసులపై వెనక్కు తగ్గేది లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టం చేశారు. ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఉత్తుత్తి ప్రారంభోత్సవాలు చేస్తోందని మండిపడ్డారు. పనులు పూర్తికాకుండా ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి శంఖారావం సభలో పాల్గొన్న లోకేశ్ ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలని నిలదీశారు.
సైకో జగన్ టీడీపీ నేతల ఇళ్లపై పోలీసులను ఉసిగొల్పుతున్నది అందుకే : నారా లోకేశ్
బాబాయ్‌ని చంపిందెవరు? అని ఏ ఒక్కరిని అడిగినా సమాధానం వస్తుందని లోకేశ్ అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekanandareddy) కుమార్తె సునీత తన తండ్రి హత్యకు జగన్, ఆయన అనుచరులే కారణమని చెప్పలేదా అని గుర్తు చేశారు. మీరు విడిచిన బాణం కాంగ్రెస్‌లో చేరాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో వాడుకుని, చివరికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనే ఆందోళనతో తల్లి, చెల్లిని రోడ్డుపైకి గెంటేశారని ధ్వజమెత్తారు. సొంత చెల్లెళ్లకే అన్యాయం చేసిన వ్యక్తి మనకు న్యాయం చేస్తాడా అని ఆంధ్రాలో మహిళలంతా ఆలోచించాలని లోకేశ్ కోరారు. సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. రూ.2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించారని తెలిపారు.
'తిక్కోడు తిరునాళ్లకు పోతే ఎక్కా, దిగా సరిపోయిందట- అలా ఉంది సీఎం జగన్ తీరు'
అభివృద్ధి, సంక్షేమంపై చర్చించడానికి జగన్ సిద్ధమా అని లోకేశ్ సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో తప్పించుకోకుండా డేట్, సమయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ ను చూస్తే కటింగ్, ఫిటింగ్ మాస్టర్ గుర్తుకొస్తారన్న లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్ దగ్గర రెండు రకాల బటన్లు ఉంటాయని, బ్లూ బటన్ నొక్కితే జనం ఖాతాలో పది రూపాయలు పడతాయని, ఎర్ర బటన్ నొక్కితే అదే ఖాతా నుంచి 100 రూపాయలు కట్ అవుతాయని వివరించారు. కరెంటు చార్జీలు 9సార్లు, ఆర్టీసీ చార్జీలు 3సార్లు పెంచారని, మద్యం ధరలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వెల్లడించారు. అన్న క్యాంటీన్ మూయించారని, పెళ్లి కానుక రద్దు చేశారని, రైతులకు డ్రిప్ ఇరిగేషన్, వృద్ధుల పింఛన్ కట్ చేశారని చెప్పారు.
జగన్‌కు బీసీలంటే చిన్నచూపు - అపాయింట్మెంటే ఇవ్వరు: నారా లోకేశ్
ఐదేళ్లుగా బీసీలకు ఏం చేశారో జగన్ చెప్పాలని నారా లోకేశ్ ప్రశ్నించారు. జగన్ పాలనలో 300 మంది బీసీల హత్య, 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు తప్ప వారి సంక్షేమానికి చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శంఖారావం సభలో పాల్గొన్న లోకేశ్ ముఖ్యమంతి జగన్‌పై నిప్పులు చెరిగారు. బీసీ(BC)లకు రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని, బీసీ సబ్‌ప్లాన్ నిధులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, బీసీ సబ్‌ప్లాన్ (BC Sub plan) కింద ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్లు ఖర్చుపెడతామని స్పష్టం చేశారు. ఆదరణ (Adarana) పథకం కింద 5 వేల కోట్లు ఖర్చుపెట్టి పనిముట్లు అందిస్తామని, బీసీ భవనాలను కూడా పూర్తిచేసే బాధ్యత తీసుకుంటామని లోకేశ్ తెలిపారు.
శ్రీ సత్య సాయి జిల్లా సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న లోకేశ్ పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో శంఖారావం బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం పుట్టపర్తి (Puttaprthy) ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. మహా సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి దర్శనం చేసుకున్నారు. లోకేశ్ వెంట మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులున్నారు.
వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు, 300 మంది హత్య: లోకేశ్