ETV Bharat / politics

ఏపీ ఎన్నికలు 2024 - ఇవాళ సాయంత్రం టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా! - Lok Sabha Elections 2024

TDP MP Candidates List 2024 : ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపట్లో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Chandrababu on MP Candidates Finalization
TDP Chief Chandrababu on MP Candidates Finalization
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 19, 2024, 12:26 PM IST

TDP MP Candidates List 2024 : ఏపీ తెలుగుదేశం ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపట్లో కొంతమంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 10 మందికి పైగా ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించింది.

AP TDP Lok Sabha Candidates List 2024 : ఎన్డీఏకు లోక్​సభలో 400కు పైగా స్థానాలు, ఆంధ్రప్రదేశ్ 160కి పైగా అసెంబ్లీ స్థానాలు అనే నినాదం రాష్ట్రం అంతటా ప్రతిధ్వనిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇది నవశకం ఆవిర్భావానికి సంకేతంగా పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్​లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్‌

"ఎన్డీయేకు 400, ఏపీకి 160కి పైగా అసెంబ్లీ స్థానాల నినాదం ప్రతిధ్వనిస్తోంది. నవశకం ఆవిర్భావానికి ఇది సంకేతం. రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు దృఢమైన నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది." - చంద్రబాబు, టీడీపీ అధినేత

తెలుగుదేశం ఎంపీ అభ్యర్ధుల తొలి జాబితా ఇలా ఉండే అవకాశం ఉంది.

1. శ్రీకాకుళం - కె. రామ్మోహన్ నాయుడు

2. విశాఖ - ఎం. భరత్

3. అమలాపురం - గంటి హరీష్

4. విజయవాడ - కేశినేని శివనాథ్ (చిన్ని)

5. గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్

6.నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయులు

7. ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి/ రాఘవరెడ్డి

8. నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

9. చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్

10 అనంతపురం - బి.కె.పార్దసారధి

11 నంద్యాల - బైరెడ్డి శబరి

ఏపీలో ఎన్నికల ప్రచారంలో కూటమి దూకుడు - టీడీపీ లోక్​సభ అభ్యర్థులు వీరే!

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితా విడుదల - 34 మందికి ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.