TDP MLA Anagani Satya Prasad Fire on CM Jagan: వైఎస్సార్సీపీ పాలనలో అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు సీం జగన్ ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని టీడీపీ శాసనసభ్యుడు అనగాని సత్య ప్రసాద్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిలో జగన్ తీసుకొచ్చిన మార్పులు ఏంటి అని ప్రశ్నించారు. విధ్వంసం, నాశనం చెయ్యడం తప్ప మార్పులు తీసుకురావడం సీఎం జగన్‌కు తెలుసా అని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్మెంట్ ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిని 10 లక్షల మంది విద్యార్థులకు కుదించటం మార్పా అని దుయ్యబట్టారు.
టీడీపీ ప్రపంచానికి అరకు కాఫీని ప్రమోట్ చేస్తే - వైఎస్సార్సీపీ గంజాయిని చేస్తోంది: చంద్రబాబు
4వేల 709 పాఠశాలలు మూతపడ్డాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 54 వేల కోట్ల రూపాయల భారం మోపారని ఆక్షేపించారు. టీడీపీ హయాంలో రూ.67 వేల కోట్లు ఖర్చుచేసి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, పట్టిసీమ నిర్మించి నదుల అనుసంధానం చేశారని అనగాని గుర్తుచేశారు. కాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులను మొండి గోడలుగా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెంచడం, నిరుద్యోగ భృతి రద్దు చేయటం జగన్ తెచ్చిన మార్పా అని ఎద్దేవాచేశారు. గత ప్రభుత్వానికి, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజల్ని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో చెబుతున్న పచ్చి అబద్ధాలు వినలేక ప్రజలు పారిపోతున్నారని ఎద్దేవాచేశారు.
మరోవైపు పంట సాగుకు చుక్కనీరు ఇవ్వలేని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రగల్భాలతో మాటల కోటలు కడుతోందని బాపట్ల జిల్లాలోని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. కారంచేడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నిఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ అరాచక ప్రభుత్వానికి కాలం చెల్లిపోయే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. సొంత పార్టి నేతలే జగన్‌ను నమ్మె స్థితిలోలేరని ఎద్దేవాచేశారు.
ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయం వల్ల రైతులు నష్టపోతున్నారు: ఎమ్మెల్యే పార్థసారథి
ఇదిలా ఉండగా మంత్రి కాకాణి ధన దాహానికే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలిపోతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కంటైనర్ లోడింగ్, అన్ లోడింగ్‌కు పోర్టు యాజమాన్యం మూడు వేల రూపాయల ఛార్జ్ వసూలు చేస్తుంటే, కాకాణి రౌడీ గ్యాంగ్ 1,500 నుంచి 2,000 రూపాయల మామూళ్లు వసూలు చేస్తోందని సోమిరెడ్డి ఆరోపించారు. ఈ రౌడీ గ్యాంగ్ మామూళ్ల కారణంగానే నెల్లూరు నుంచి కంటైనర్ టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతోందన్నారు.
ఫలితంగా రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు నష్టపోనున్నాయని తెలిపారు. తెలుగుదేశం పాలనలో ఆదాయంలో ఉన్న కంటైనర్ టెర్మినల్, వైఎస్సార్సీపీ పాలనలో నష్టాల్లోకి వెళ్లిందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి తరలిపోతున్నాయని మండిపడ్డారు. రౌడీ గ్యాంగ్ మామూళ్లతో ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధం లేకుంటే, మంత్రి కాకాణిపై చర్యలు తీసుకుని కంటైనర్ టెర్మినల్ తరలిపోకుండా చూడాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
దళితులకు అన్యాయం చేసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారు : టీడీపీ నేతలు