ETV Bharat / politics

నేడు టీడీఎల్పీ సమావేశం - పది అంశాలపై చర్చ

TDP Legislative meeting: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో జరగనుంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు చేపట్టిన రా కదలిరా కార్యక్రమం తిరిగి సోమవారం ప్రారభం కానుంది.

TDP_Legislative_Meeting
TDP_Legislative_Meeting
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 10:52 AM IST

TDP Legislative Meeting : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో జరగనుంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభ సమావేశాల్లో మొత్తం పది అంశాలపై చర్చకు పట్టుబట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అప్పుల ఊబిలో రాష్ట్రం, సౌర విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వ పెద్దల బినామీలకు వేల ఎకరాలు కేటాయింపుపై ప్రధానంగా చర్చించనున్నారు.

అక్రమ రాయితీలు, విద్యుత్ ఛార్జీల బాదుడు, స్థానిక సంస్థల నిధులు దారి మళ్లింపు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన భూమి కేటాయించకపోవడం అంశాలపై చర్చలు జరగనున్నాయి. కరవు మండలాల ప్రకటనలో ప్రభుత్వ వైఫల్యం, మిచౌంగ్ తుపాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యం, ఇసుక, బెరైటీస్ గనుల్లో గోల్ మాల్, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అప్పగించడంలో ప్రభుత్వం వైఫల్యంపై చర్చించనున్నారు. తిరుపతిలో టీడీఆర్‌ బాండ్ల కుంభకోణం, రాష్ట్రం నుంచి పరిశ్రమల్ని వెళ్లగొట్టడం, పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చలు జరపాలని తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలో మూడు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున, అభ్యర్థిని నిలబెట్టే అంశంపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

ఉద్యోగాల భర్తీపై జగన్ ఏనాడూ శ్రద్ధ పెట్టలేదు - నాది విజన్‌, జగన్‌ది పాయిజన్‌: చంద్రబాబు

Chandrababu Ra Kadali Ra Meeting : తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా గత నెల నెల 30 నుంచి ఈ నెల 4 వరకూ రా కదలిరా సభలకు విరామం ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి సోమవారం రా కదలిరా సభలు ప్రారంభం అవతున్నాయి. రెండు రోజుల పాటు మూడు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన చేయనున్నారు. సోమవారం అనకాపల్లి పార్లమెంటు మాడుగుల,ఏలూరు పార్లమెంటు చింతలపూడిలలో రా కదలిరా బహిరంగ సభల్లో పాల్లోననున్నారు. మంగళవరం చిత్తూరు పార్లమెంటు జీడీ నెల్లూరులో రా కదలిరా సభ ఆయన ప్రసగించనున్నారు. ఈ కార్యక్రమాలకు టీడీపీ స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముందు పులివెందులలో గెలిచి చూపించు జగన్- చంద్రబాబు సవాల్

చంద్రబాబునాయుడు చింతలపూడిలో సోమవారం నిర్వహించనున్న రా కదలిరా సభకు లక్ష మందికి తక్కువ కాకుండా ప్రజలు తరలివస్తారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని విమర్శించారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆరోపించారు. టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చంద్రబాబు సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రం బాగుపడాలంటే సైకో జగన్ పోవాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.