ETV Bharat / politics

సానుభూతి డ్రామాలు కొత్త కాదు - అంతా జగన్నాటకమే: టీడీపీ నేతలు - TDP Leaders on Jagan - TDP LEADERS ON JAGAN

TDP Leaders Reaction on Stone Attack on CM Jagan: ఎన్నికలకు ముందు ఇటువంటి సానుభూతి డ్రామాలు ఆడటం జగన్​కు కొత్తకాదని టీడీపీ నేతలు విమర్శించారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, మీ ప్రయత్నాలను తిప్పి కొడతారని అన్నారు. ఇది మరో కోడికత్తి 2.0 తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు.

tdp_leaders__on_jagan
tdp_leaders__on_jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 14, 2024, 12:51 PM IST

TDP Leaders Reaction on Stone Attack on CM Jagan: జగన్​కు తగిన గాయాలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్ అంటే ఇంకెక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా అంటోందని ఎద్దేవా చేశారు. జగన్ కొత్తగా ఏదైనా ప్రయత్నించాలంటూ హితవు పలికారు.

Nakka Anand Babu: జగన్‌ది మరో కోడి కత్తి డ్రామా, గత ఎన్నికలకు ముందు కోడి కత్తి డ్రామా ఆడారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. ఫలితంగా ఐదేళ్లు అమాయక దళితుడు జైలులో ఉన్నాడని ఇప్పుడు రాయి డ్రామాకు ఏ దళితుడిని బలి చేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. ఐ ప్యాక్ డైరెక్షన్‌లో ఇంకా ఎన్ని డ్రామాలు చూడాలో అని నక్కా ఆనంద్ బాబు ఎద్దేవా చేశారు.

Payyavula Keshav: దున్నపోతు ఈనింది దూడను కట్టేయమన్నట్లుగా వైసీపీ నేతల వ్యవహారం ఉందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జరగని దాడిని జరిగినట్లు ప్రచారం చేసుకుని సానుభూతి కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, ఇది మరో కోడికత్తి 2.0 తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. ప్రజలు త్వరలో బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

టీడీపీపై పగ - పేదలపై కక్ష - సొంతింటి కలను పాతరేసిన జగన్ సర్కార్ - Jagananna Colonies Problems

Varla Ramaiah: తాడేపల్లి ప్యాలెస్ డైరక్షన్​లో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజి సీతారామాంజనేయులు ఆడిన నాటకంలో భాగంగా కోడికత్తి 2.0 కు తెర లేపారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. గతానుభవాల దృష్ట్యా జనం ఇక జగన్ నాటకాలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికలకు ఖచ్చితంగా 30రోజుల ముందు ఇటువంటి సానుభూతి డ్రామాలు ఆడటం కొత్తకాదని దుయ్యబట్టారు. చైతన్యవంతులైన ప్రజలు కుట్రలను అర్థం చేసుకుని ప్రజాక్షేత్రంలో బుద్ది చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

Vangalapudi Anita: గొడ్డలివేటు, కోడికత్తి నాటకాలు అయిపోయి ఇప్పుడు గులకరాయి దాడి డ్రామాకు జగన్ తెర లేపారని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ప్రజలు కపట నాటకాలను గ్రహించలేనంత అమాయకులు కారన్నారు. వేలాదిమంది పోలీసుల భద్రత మధ్య దాడి జరగడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. నిజంగా దాడి జరిగి ఉంటే సంబంధిత భవనాన్ని చుట్టుముట్టి నిందితుడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు.

ఇది 'కోడికత్తి డ్రామా 2.0' - సోషల్​ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు - Attack on YS Jagan

Somireddy Chandramohan Reddy: దాడి ఘటన జరిగిన 4వ నిమిషానికే క్యాట్ బాల్ ఉపయోగించారని బులుగు మీడియా, జగన్ సోషల్ మీడియాకు ఎలా తెలిసిందని పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్న వైసీపీ కార్యకర్తలు పోలీసులు నిందితుడిని ఎందుకు పట్టుకోలేక పోయారని ప్రశ్నించారు. సరిగ్గా కనుబొమ్మపై తగిలేలా కొట్టేంత ఏకలవ్యులు జగన్ జమానాలో ఉన్నారేమో కానీ, వందలాది మంది పోలీసుల మధ్య ఉన్న ముఖ్యమంత్రిని కొట్టడం ఆషామాషీ కాదని స్పష్టం చేశారు.

Pattabhiram: సీఎంపై జరిగిన రాయి దాడి డ్రామాకు సంబంధించి తాడేపల్లి ప్యాలెస్‌లో ముందుగానే స్క్రిప్ట్ రాశారని తెలుగుదేశం నేత పట్టాభిరామ్‌ ఆరోపించారు. డ్రామాలో హీరో జగన్‌, సైడ్‌ హీరో వెల్లంపల్లి అని ఎవరి పాత్రలు వారు అద్భుతంగా పోషించారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసం దాడి చేయించుకోని

Anam Venkata Ramana Reddy: తాడేపల్లి డైరెక్షన్‌లోనే విజయవాడలో సీఎం జగన్‌పై దాడి జరిగిందని తెలుగుదేశం నేత ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఒక రాయి మూడు చోట్ల ఎలా గాయపరుస్తుందని ఆనం ఎద్దేవా చేశారు. నిన్నటి ఘటనలో సీఎం జగన్‌ అద్భుతంగా నటించారన్నారు.

జగన్‌ త్వరగా కోలుకోవాలి - ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల ఆకాంక్ష - CONDEMNED ATTACK ON CM JAGAN

Ram Gopal Reddy: రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరో జగన్నాటకానికి తెర లేపారని రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో సానుభూతి పొందడానికి మరో కుట్ర బయట పెట్టారన్నారు. గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య, కోడి కత్తి కేసుల వలె మరో నాటకానికి తెర తీశారని చెప్పారు.

Pemmasani Chandrasekhar: ముఖ్యమంత్రి జగన్ పై దాడి చేసే అజ్ఞానవంతులు తెలుగుదేశం, జనసేన పార్టీలలో లేరని గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. విజయవాడలో ముఖ్యమంత్రి జగన్​పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాడికి పాల్పడ్డ వ్యక్తి ఏ పార్టీ అయినా సరే అతను శిక్షకు పూర్తి అర్హుడు అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.