ETV Bharat / politics

జగన్‌పై పోటీ చేస్తున్న బీటెక్‌ రవికి ప్రాణహాని - ఈసీకి కనకమేడల లేఖ - Kanakamedala Ravindra letter to ECI

Kanakamedala Ravindra Letter to ECI: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు. జగన్‌పై పోటీ చేస్తున్న బీటెక్‌ రవికి ప్రాణహాని లేదని ఎస్పీ చెప్పడం వాస్తవ విరుద్ధమని, ఆయన భద్రతపై అధికారులు తేల్చలేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

Kanakamedala Ravindra Letter to ECI
Kanakamedala Ravindra Letter to ECI
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 10:34 PM IST

Kanakamedala Ravindra Letter to ECI : పులివెందుల అసెంబ్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని ఈసీఐ ఆదేశించినా కొంతమంది అధికారులు అధికార పార్టీ ఒత్తిడితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పులివెందులలో జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి నియోజకవర్గంలో తగు చర్యలు కోరుతూ గతంలోనే ఈసీఐకి లేఖ రాసారని గుర్తు చేసారు.

వ్యక్తిగత భద్రతతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించిన కె. అశోక్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాంటూ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పెంచాలని లేఖలో కనకమేడల ప్రస్తావించారు. పులివెందుల చినచౌక్, రూరల్ ఇన్‌స్పెక్టర్‌ అశోక్ రెడ్డి గత ఐదేళ్లుగా ఒకే స్థానంలో పని చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. కానీ, జిల్లా ఎస్పీ అది ఫంక్షనల్ పోస్ట్ అంటూ ఎన్నికల సంఘం ఫంక్షనల్ ఫోస్టలకు అభ్యంతరం తెలిపలేదంటూ కవరప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నన్ను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారు: బీటెక్‌ రవి

జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న బీటెక్ రవికి ఎటువంటి ప్రాణహాని లేదని స్థానిక ఎస్సీ చెప్పడం వాస్తవ విరుద్ధమని అన్నారు. రవికి భద్రత కల్పించే విషయంలో ఎన్నికల అధికారులైన డీఈఓ, సీఈఓలు ఎటూ తేల్చకపోవడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఎంపికలో ఎన్నికల అధికారులు, పోలీసులు పోటీ చేస్తున్న అభ్యర్ధులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఈసీఐ చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. కానీ, స్థానిక ఎస్పీ పులివెందులలోని మొత్తం 68 కేంద్రాలలో కేవలం 32 మాత్రమే సమస్యాత్మక కేంద్రాలని ఏకపక్ష నిర్ణయం చేసారని దుయ్యబట్టారు.

ఎస్పీ నిర్ణయించిన కేంద్రాలనే డీఈఓ ఫైనల్ చేసి ఏపీ సీఈఓకు పంపారు. పులివెందుల డెవలప్మెంట్ అథారిటీ (PADA) ఓఎస్‌డీ అనిల్ కుమార్ రెడ్డి వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అనిల్ కుమార్ రెడ్డి అధికారపార్టీకి అనుకూలంగా పనిచేసినందుకు సీఎం ఆశీస్సులతో ఇటీవల ఐఏఎస్ క్యాడర్​ను పొందారని ఆరోపించారు. పాడా ఆఫీస్‌ను ఇటీవల పులివెందుల రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు ప్రక్కనే ఉన్న మినీ సెక్రటరీయేట్​కు మార్చారన్నారు.

బతికుంటేనే కదా పోటీ చేసేది అంటూ - తుపాకీ ఎక్కుపెట్టి బెదిరించారు: బీటెక్ రవి

వైసీపీ ఎన్నికల కార్యకలాపాలను పర్యవేక్షించడం కోసమే PADA ఆపీసును ఎన్నికల ఆఫీసు దగ్గరకు షిప్ట్ చేశారన్నారు. అయినప్పటికీ దీనిపై జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ (డీఈఓ) ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. పైన పేర్కొన్న విషయాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టి బీటెక్ రవికి వెంటకే భద్రత కల్పించాలని కోరారు. స్పెషల్ పోలీస్ పర్యవేక్షకుడి ద్వారా పులివెందులలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. పోలీసులతో సమానంగా ఒక వ్యవస్థనే నడిపిస్తున్న అశోక్ రెడ్డిని వెంటనే వేరే ప్రాంతానికి బదిలీ చేయాలనీ డిమాండ్ చేశారు.

బీటెక్ రవిని హతమార్చేందుకు కుట్ర పన్నిన మాట వాస్తవం కాదా ? ఎస్పీ ప్రమాణం చేయగలరా?: సీఎం రమేష్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.