Ayanna Patrudu on Jagan Photo in Pass Books: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రచారయావ రైతుల పాలిట శాపంగా మారిందని మాజీమంత్రి టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు (TDP leader Ayyanna Patrudu) ఆరోపించారు. రైతులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ చిత్రాన్ని ముద్రించడంతో ఆన్లైన్లో నమోదు చేసేందుకు ఆటంకం కలుగుతుందని, బ్యాంక్ అధికారులు సైతం రుణాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సమస్యలపై ఎన్నికల కమీషన్ ప్రత్యేక దృష్టి సారించి చిన్నపాటి రైతుల కుటుంబాలకు నష్టం కలగకుండా చూడాలని అయ్యనపాత్రుడు విజ్ఞప్తి చేశారు.
పొత్తులతో పార్టీలో ఇబ్బందులు సహజం - రాష్ట్రం కోసం రాజీపడక తప్పదు: అయ్యన్నపాత్రుడు
పాస్‌బుక్‌లపై జగన్ ఫోటో (CM Jagan Photo on Pass Books) ఉండటం వల్ల బ్యాంక్ అధికారులు రైతులకు రుణాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్నారని అయ్యన్న అన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని గప్పాడ గ్రామానికి చెందిన ఓ రైతు నర్సీపట్నం కోపరేటివ్ బ్యాంకులో సుమారు 10 లక్షల రూపాయలకు బ్యాంకు రుణానికి దరఖాస్తు చేయగా అవసరమైన పత్రాలతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందజేశారు. అవే పత్రాలను యధావిధిగా విశాఖపట్నం ప్రధాన బ్రాంచ్‌కు పంపించగా అక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫొటో ఉన్న కారణంగా ఆన్లైన్లో తిరస్కరిస్తున్నట్టు చూపిస్తుందని అన్నారు.
Jagan photo on Passbook: నా పాస్ బుక్‌పై జగన్ ఫొటో ఎందుకు..? అధికారులను నిలదీసిన రైతు
ఇలా జగన్ ఫొటోలు ఉండటం వల్ల తమ బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయలేమని బ్యాంక్ అధికారులు చేతులెత్తేసారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని అవసరమైతే తాము ఫిర్యాదులు చేస్తామని అయ్యన్న అన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా వాహనాలకు అవసరమైన మైక్ సెట్ తదితర సామగ్రికి ఒకేసారి చలానా చెల్లిస్తామని తెలిపారు. ఎన్నికల నిబంధనల్లోనూ కొన్ని సడలింపులు చేయాల్సిన అవసరం ఉందని దీనిపై సీఈవో ప్రత్యక దృష్టి సారించాలని కోరారు. ఈ విషయంపై అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం ఆర్డీవో జయరాంను కలిసి చర్చించగా దీనిపై తప్పనిసరిగా తాము జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తామని ఆర్డీఓ తెలిపినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు.
CM Jagan Publicity: ప్రజాధనంతో స్వప్రయోజనం.. 'సంపూర్ణ జగన్ ప్రచార పథకం'.. అన్నింటా అన్న ఫొటోనే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓపక్క ఒత్తిడితో ఉక్కపోతతో అల్లాడిపోతుంటే వ్యవసాయ శాఖ మాత్రం వారికి పంకా ఊపే ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధీనంలోని పలు యాప్‌లలో ముఖ్యమంత్రి జగన్ ఫొటోలతో పాటు వైసీపీ గుర్తులను ప్రదర్శించడం వివాదాస్పదకరంగా మారింది. వ్యవసాయ శాఖకు సంబంధించిన వైఎస్సార్ యాప్, సీఎం యాప్‌లలో జగన్ పొటోతో పాటు వైసీపీ గుర్తు నిబంధనలకు విరుద్ధంగా కన్పిస్తోంది. ఓవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికారులు వీటిని తొలగించకుండా స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీటిపై ఎన్నికల కమీషన్ తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరముందని పలువురు ఆరోపిస్తున్నారు.