TDP Jayaho BC Public Meeting : వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి, పూర్తి స్థాయి సామాజిక న్యాయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీలు ఉమ్మడిగా నేడు బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జయహో బీసీ వేదికపై రెండు పార్టీల చంద్రబాబు (Chandrababu Naidu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) డిక్లరేషన్ ఆవిష్కరించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్ (BC Declaration) రూపొందించినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు, కార్పొరేషన్, నామినేటెడ్ పదవులు, సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
TDP BC Declaration on March 5 : తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలకు ఆ పార్టీ అధిక ప్రాధాన్యం కల్పిస్తూ వచ్చింది. బీసీల రాజకీయ ఎదుగుదల కోసం తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు స్థానిక సంస్థల్లో వారికి తొలిసారిగా 20 శాతం రిజర్వేషన్ కల్పించారు. అనంతరం చంద్రబాబు బీసీల రిజర్వేషన్‌ను 34 శాతం వరకు పెంచారు.
జయహో బీసీ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్- నాదెండ్ల మనోహర్
టీడీపీ పాలనలో బీసీలకు ఆర్థిక చేయూత అందించేందుకు 4.20 లక్షల మందికి ఆదరణ పథకం కింద పనిముట్లు పంపిణీ చేశారు. సంక్షేమానికి తోడుగా ఉప ప్రణాళిక కింద 36వేల కోట్లకు పైగా వివిధ పథకాలకు ఖర్చు చేశారు. బీసీలకు అనేక పథకాలు అందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక బీసీలకు దగా చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో బీసీలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు తెలుగుదేశం జనవరి 4 నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బీసీ వర్గాలకు చెందిన వారితో దాదాపు 850కు పైగా సభలు సమావేశాలు నిర్వహించింది. 54 బీసీ కులాలతో సాధికార కమిటీలు ఏర్పాటు చేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కల్పించాల్సిన అవకాశాలపై ముసాయిదా సిద్ధం చేసింది. అనంతరం 19 మంది తెలుగుదేశం జనసేన నేతలతో కమిటీ ఏర్పాటు చేసి డిక్లరేషన్ రూపొందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి మంగళగిరిలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో నేడు డిక్లరేషన్‌ని ప్రకటించనున్నారు.
చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి : టీడీపీ నేత పుత్తా నరసింహా రెడ్డి
BC Declaration Meeting at Acharya Nagarjuna University : జగన్ అధికారంలోకి వచ్చాక బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గించి 16 వేల 800 మందిని పదవుల నుంచి దూరం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. కార్పొరేషన్లకు రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. తెలుగుదేశం - జనసేన అధికారంలోకి వస్తే బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని నేతలు స్పష్టం చేశారు.