ETV Bharat / politics

నిజం గెలవాలి యాత్ర తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నా: నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari Interview

Nara Bhuvaneshwari Interview: చంద్రబాబు జీవితం ఇక తెలుగుదేశం పార్టీకి, ప్రజలకే అంకితమని నారా భువనేశ్వరి అన్నారు. బ్రిటిష్ పాలన తరహా వైసీపీను ఓడిద్దామని పిలుపునిచ్చిన ఆమె అప్పటివరకూ ప్రజలతోనే ఉంటానన్నారు.

Nara_Bhuvaneshwari_Interview
Nara_Bhuvaneshwari_Interview
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 1:39 PM IST

Nara Bhuvaneshwari Interview: చంద్రబాబు జీవితం ప్రజలు, తెలుగుదేశం పార్టీకే అంకితమని ఆయన భార్య నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. గతంలో తాను కుటుంబానికి సమయం ఇవ్వాలని కోరారని, నిజం గెలవాలి యాత్ర తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని ఆమె చెప్పారు. ఈ నెల 19న కుప్పంలో చంద్రబాబు తరఫున నామినేషన్‌ వేస్తానంటున్న భువనేశ్వరితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

చంద్రబాబు ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యత నిజం గెలవాలి: చంద్రబాబు నాపై నమ్మకంతో అప్పగించిన నిజం గెలవాలి కార్యక్రమం బాధ్యతతో మనస్ఫూర్తిగా నిర్వహించా. బాబు అరెస్టుతో మనోవేదనతో చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరఫున భరోసా ఇవ్వాలని నాకు చంద్రబాబు జైళ్లో ఉండగానే చెప్పారు. చంద్రబాబు భార్యగా కంటే కార్యకర్తల్లో నేనూ ఓ కార్యకర్తగానే దీనిని ముందుకు తీసుకెళ్లగలిగాను. సుదీర్ఘ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. నాయకుడి కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తలు ఓ వైపు, ప్రభుత్వ వేధింపులతో ఆత్మహత్యలు చేసుకున్న వారు కొందరు.

ఇంకొందరు హత్యకు గురైతే, మరి కొందరు దాడులకు గురయ్యారు. వారందరి మనోవేదనే నన్ను ముందుకు నడిపించింది. ఈ సమయంలో బ్రాహ్మణి కోడలిగా కంటే ఓ కూతురిలా నావెంట నిలచింది. ఓ పక్క భయం, మరో పక్క దుఃఖంతో ఉన్న నేను నిజం గెలవాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచిస్తుంటే, బ్రాహ్మణీ కూతురిలా ధైర్యం చెప్పి నన్ను వెనుక నుంచి నడిపించింది. చంద్రబాబు జైల్లో ఉన్న 53రోజులు నన్ను ఓ అత్తలా కాకుండా తల్లిలా అన్నీ తానై చూసుకుంది.

వైఎస్సార్సీపీకి గుడ్​బై- రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనలో భారీగా చేరికలు - YCP JOINed JSP AND TDP

రోడెక్కాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు: నేనూ రోడెక్కే పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబే నన్ను కార్యకర్తల కోసం పంపించారు. ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకున్నా. సెప్టెంబర్ 10వ తేదీన పెళ్లి రోజు నాడు ఉదయమే లోకేశ్ ఫోన్ చేసి నాన్న అరెస్టు అయ్యారనే విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు. తాను కంగారుగా ఫోన్ పెట్టేసరికి నేను తొలుత నమ్మలేదు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి పూర్తి విషయం చెప్పాడు.

చంద్రబాబు అవినీతి చేశారంటే నేనస్సలు నమ్మలేదు. తొలుత 3వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని నైపుణ్యాభివృద్ధి కేసులో అరెస్టు చేశారన్నారు. తర్వాత రూ.300కోట్ల అవినీతి అన్నారు. అదీకాదని ఇప్పుడు 27కోట్ల రూపాయల అవినీతి అంటున్నారు. దీనికీ ఒక్క ఆధారమూ చూపలేదు. అదీ చంద్రబాబు అంటే. చంద్రబాబు, లోకేశ్​కు వస్తున్న ప్రజా స్పందన చూసే అరెస్టు చేశారని నాతో పాటు ప్రజలూ నమ్మారు. చేయని నేరానికి జైల్లో ఉన్నారనే బాధతో పాటు ఏ తప్పు చేయలేదనే ధైర్యమే నన్ను నిలబెట్టాయి.

ఈ రాజకీయాలు కుటుంబానికి అవసరమా అనిపించింది: చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తొలిసారి చూసిన ఘటన నా జీవితంతో మర్చిపోలేను. అప్పటికే నిబంధనల పేరుతో జైలు అధికారులు కొన్ని రోజుల పాటు ములాఖత్ ఇవ్వలేదు. న్యాయపోరాటం తర్వాతే కుటుంబ సభ్యులుగా మాకు చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం లభించింది. లోకేశ్​ చంద్రబాబుని చూసే సమయంలో ముందుకు వెళ్లవద్దని వారించినా నేను ఆగలేకపోయా.

ప్రపంచ కీర్తి పొందిన నాయకుడిని ఓ ఖైదీని తీసుకొచ్చినట్లు తీసుకురావటం చూసి తట్టుకోలేకపోయా. రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టం పడింది ఇది చూస్తానికేనా అనిపించింది. ఆ సమయంలో కూడా ఈ బాధ తాత్కాలికమే అని నన్ను చంద్రబాబు ఓదార్చే ప్రయత్నం చేశారు. కుటుంబానికి ఇవ్వన్నీపడాల్సిన అవసరం ఎందుకని అనిపించింది. ఇందుకోసమే రాజకీయాల్లో కొనసాగాలా అనిపించింది. ఆ తర్వాత నాకు నేనే సద్దిచెప్పుకున్నా స్వాతంత్య్ర పోరాట పరిణామాలను గుర్తు చేసుకుని అలాంటి ఘటనే ఇదొకటి అని ఆలోచించా.

స్వాతంత్య్రం కోసం ఏ తప్పూ చేయకున్నా నాయకులు జైలుకెళ్లారు. రాష్ట్రం కోసం ఈయన జైలుకెళ్లాల్సి వచ్చిందని నాకు నేను సద్దిచెప్పుకున్నా. జైలుకెళ్లినప్పుడు రాజమండ్రిలో తొలుత మాకు ఇల్లు ఇచ్చిన దాతకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ ఇంటిని కూడా మాకోసం వచ్చే ప్రజల్ని కలవటం కోసమే వినియోగించుకుని మేము బస్సులోనే ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ధైర్యం చెప్పారు.

చంద్రబాబు జీవితం టీడీపీ, ప్రజలకే అంకితం: ప్రత్యేక ముఖాముఖిలో నారా భువనేశ్వరి

కుటుంబం కోసం సమయం ఇవ్వాలి ఇవ్వాలి అని చంద్రబాబుతో తరచూ గొడవ పడిన నేను ఇప్పుడు చంద్రబాబు జీవితం ప్రజలకే అంకితం అని చెప్తున్నా. ఇంకెప్పుడూ ఆయన్ను ఇబ్బంది పెట్టను. చంద్రబాబును ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో ప్రత్యక్షంగా చూశాక నా ఆలోచనా మారింది. ఆయన జీవితం ఇక తెలుగుదేశం పార్టీకి, ప్రజలకే అని భార్యగా ఇప్పుడు నేనే చెప్తున్నా. నిజం గెలవాలి కార్యక్రమంలో ఉండగానే చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ సందర్భంలో నేను ఆయన పక్కన లేను. కానీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి ఓ పండగలా సంబరాలు చేసుకున్న తీరు చూసి ఎంతో ఆనందపడ్డా.

చంద్రబాబుపై రాయి దాడికి యత్నం- విజయవాడ డ్రామాపై కూడా తేలుస్తానంటూ ఆగ్రహం - stones thrown on Chandrababu

ఐఆర్​ఆర్ కేసులో లోకేశ్​ను అరెస్టు చేస్తారని విన్నా, తప్పు చేయలేదనే ధైర్యంతో ఉన్నా: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి కూడా తర్వాత లోకేశ్​ చెప్పాడు. తన పేరు ఉందని చెప్పినా ధైర్యంగా ఉన్నా. హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్​గా అన్నీ నాకు తెలుసు కాబట్టి ఆ విషయమై నేనస్సలు భయపడలేదు. ఎందుకంటే ఏ తప్పూ చేయలేదనే నమ్మకమే ఆ ధైర్యాన్ని ఇచ్చింది. రాజధాని వస్తుందని భూములు కొనాలనుకుంటే 100ఎకరాలు కొనేవాళ్లం కానీ నాలుగు ఎకరాలు కొని ఊరుకుంటామా.

హెరిటేజ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఎంతో పారదర్శకంగా వ్యవహరించింది. నాలుగెకరాల గురించి మాపై కేసు పెడితే అధికారం అండతో వేలాది ఎకరాలు కొట్టేసిన వైసీపీ నేతల్ని ఏమనాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రతీ జిల్లా ఒక పారిశ్రామిక హబ్​గా అభివృద్ధి చేయాలనుకున్నారు. ఆ జిల్లా అభివృద్ధి చెందితే ప్రజల భూమి విలువ పెరిగి లాభపడతారని ఆలోచించే నాయకుడు నాలుగు ఎకరాల కోసం కక్కుర్తి పడతారా. ఏమీ దొరక్క ఏదోక దాన్ని బూచిగా పట్టుకోవాలని ఈ అంశాన్ని పట్టుకుని గోల చేయాలనుకున్నారు. కానీ ప్రజలు నమ్మలేదు. వారే మా పక్షాన నిలిచారు.

ప్రజల్ని మోసం చేయాలనుకున్నారు కానీ మోసపోలేదు. చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలే ప్రభుత్వంపై తిరగపడేందుకు రోడెక్కి ఆయన విడుదల కోసం పోరాడారు. ఐఆర్ఆర్ కేసులో కంపెనీ ఎండీగా నేనేతప్పూ చేయలేదనే ధైర్యంతో ఉన్నా. సీఐడీ వాళ్లు కేసు పెట్టినప్పుడు చట్టాన్ని గౌరవించి ఎన్నో ఒరిజినల్ డాక్యుమెంట్లు వారు అడిగితే అందచేశాం. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తే, తప్పుడు కేసు అనేది రుజువవుతుందనే వాటిని ఇటీవల కాల్చేశారు. మా ఒరిజినల్ డాక్యుమెంట్లు అప్పగించమని నోటీసులు పంపినా ఇంతవరకూ స్పందించలేదు.

నిజం గెలవాలి రాజకీయ యాత్ర కాదు: రాజకీయాల కోసం నిజం గెలవాలి చేపట్టలేదు. కానీ తెలుగుదేశం కార్యకర్తల కోసం దీనిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించా. బిడ్డలాంటి కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాను. చంద్రబాబు భార్యగా కాకుండా ఓ సాధారణ మహిళగానే నిజం కోసం ముందుకెళ్తూ ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు వేయాలనే నినాదంతో ఎన్నికల వరకూ ముందుకెళ్తా. చంద్రబాబు మాత్రమే ప్రజా ప్రభుత్వం ఇవ్వలగలని ప్రజా ప్రభుత్వం రావాని అనే నినాదాన్ని నిజం గెలవాలికి జోడించాం.

బ్రిటీష్ పరిపాలనలో జరిగిన హింసాత్మక ఘటనలు, అవమానాలు చరిత్రలో చూశాం, మళ్లీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నాం. ప్రజల స్వాతంత్య్రం కోసమే ఆలోచించి ఓటెయ్యాలని, ప్రజా ప్రభుత్వం రావాలి అనే నినాదంతో మే10 వరకూ దీనిని కొనసాగిస్తా. ఆ తర్వాత నా హెరిటేజ్, నా సేవా కార్యక్రమాలు, ఎన్టీఆర్ ట్రస్టు నాకు చాలు. ఇక రాజకీయాల జోలుకు రాను. కుప్పంలో నాకు ఓటేస్తారా చంద్రబాబుకు ఓటేస్తారా అని సరదాగా అడిగిన ప్రశ్ననూ వివాదం చేశారు.

అది ప్రత్యర్థులు వివాదం చేస్తారని ఊహించాను కానీ నేను మాత్రం అడిగింది సరదా ప్రశ్నే. తల్లీ కావాలా తండ్రి కావాలా అని ప్రశ్నిస్తే ఎలా అంటూ కార్యకర్తలు నాకిచ్చిన సమాధానం ఆ సమయంలో కెమెరాల్లో రికార్డు కాలేదు. నిజం గెలవాలి టీమ్ సభ్యులంతా నా బిడ్డల్లా నాతో పాల్గొన్నారు. వారిని కార్యకర్తలు అనలేను. తల్లిలా నన్ను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబును తండ్రిలా చూస్తూ ఇచ్చిన గౌరవమే తల్లిలా నాకూ ఇచ్చి సైనికుల్లా ముందుకు తీసుకెళ్లారు.

చంద్రబాబు ఆలోచించి భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తే దానిని ముందుకు తీసుకెళ్తా. చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇచ్చిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా. ఈ నెల 19వ తేదీన చంద్రబాబు నామినేషన్ ఈసారి నేనే దాఖలు చేస్తున్నా. ఇది నేను తీసుకున్న నిర్ణయమే. ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వచ్చిన స్ఫూర్తితోనే ఈసారి నామినేషన్ నేను దాఖలు చేస్తున్నా. రాష్ట్రమంతటా పర్యటిస్తున్న లోకేశ్​ మంగళగిరిలో అప్పుడప్పుడూ అందుబాటులో లేకుండా ఆ లోటు తెలియకుండా కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా ముందుకు తీసుకెళ్తున్న నాయకులకు అభినందనలు. మంగళగిరి చేనేతకారులు రూపొందించిన 4చీరలు లోకేశ్​ తీసుకొచ్చి ఇస్తే ఎంతో సంతోషం అనిపించింది.

రాష్ట్ర రహదారుల ప్రత్యక్ష నరకం నేనూ అనుభవించా: లోకేశ్​ పంచాయితీ రాజ్ మంత్రిగా వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేస్తే ప్రభుత్వం కక్షపూరితంగా వాటిని తవ్వేసింది. పాడైన రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. గుంతమయమైన రోడ్లను తిరిగి పునరుద్ధరించలేదు. అలాంటి రోడ్లపై 9వేల కిలోమీటర్లు పైగా 6 నెలలపాటు ప్రయాణించటం ఎంతో ఇబ్బంది కలిగించింది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ముందు మంచి రోడ్లు వేయించండంటూ చాలామంది విజ్ఞాపనలూ ఇచ్చుకున్నారు. వారి నమ్మకాన్ని వొమ్ము చేయకుండా ప్రభుత్వం రాగానే చంద్రబాబు మళ్లీ రాష్ట్ర రహదారులకు మహర్ధశ తీసుకొస్తారు.

నిన్నటి దాక పరదాల మాటున- తాజాగా నాటి ముద్దుల ప్రచార ప్రదర్శన ! ఓట్ల కోసమే భద్రతను మరిచారా? - CM YS Jagan security

చంద్రబాబు పథకాల గురించి అప్పటి వరకూ తెలియదు: చంద్రబాబు అరెస్టు అయ్యారనే అవేదనతో చనిపోయిన కుటుంబాల పరామర్శ కోసం చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలతోనూ మమేకమయ్యాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన పథకాలు గురించి ప్రజలు చెప్తుంటే విని ఆశ్చర్యపోయా. ప్రజలకు చంద్రబాబు ఏం పథకాలు తెచ్చారో కూడా నాకు అప్పటివరకూ తెలీదు. రాజకీయ అంశాలపై అప్పుడు నాకంత ఆసక్తి కూడా లేదు కాబట్టి పట్టించుకోలేదు.

వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయ్యేటప్పుడే మా బ్యాకాఫీసు నుంచి వివరాలు సేకరించా. ప్రతీ వర్గానికి ప్రయోజనం జరిగేలా తీసుకొచ్చిన పథకాలను పరిశీలిస్తే నాకే ఆశ్చర్యం కలిగింది. పుట్టుక నుంచి చావు వరకూ ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా పథకాల రూపకల్పన చంద్రబాబు హయాంలో జరిగిందని ఆలస్యంగా గ్రహించా. పథకాల అమలు ద్వారా ప్రజల జీవితాలు బాగుపడి రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని నమ్మిన వ్యక్తి చంద్రబాబు.

అన్న క్యాంటీన్లు మాత్రం ఆగవు: పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వాలెందుకని నినదించిన ఎన్టీఆర్ కిలో బియ్యం 2రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు. ఆ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వంలో 360అన్న క్యాంటీన్లు చంద్రబాబు ప్రారంభించారు. రోజుకు రెండున్నర లక్షల మంది చొప్పున ఏటా ఏడున్నర కోట్ల మంది కడుపు నింపే అన్న క్యాంటీన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. రాక్షసంగా పేదల కడుపుకొట్టిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే పార్టీ నేతలు అన్న క్యాంటీన్లు కొనసాగించేందుకు ప్రోత్సహించాను. ఇందుకు ఎంతోమంది తమ సహాయ సహకారాలు అందించారు. ఎన్టీఆర్ ట్రస్టును స్థాపించి నన్ను మేనేజింగ్ ట్రస్టీని చేసింది చంద్రబాబు.

కార్యకర్తల బిడ్డల కోసం చల్లపల్లిలో పాఠశాల ఏర్పాటుకూ శ్రీకారం చుట్టింది చంద్రబాబే. పేద పిల్లల చదువు కోసం చంద్రబాబు చూపిన ఆసక్తే నన్నూ ఆకట్టుకుని దానిని ఎంతో ఇష్టంగా ముందుకు తీసుకెళ్లాం. ఇప్పటివరకూ 6వేల మందికి పైగా పిల్లలు ఉన్నత విద్యలు ఈ విద్యాసంస్థల ద్వారా అందుకున్నారు. డిగ్రీ వరకూ చదివించి వదిలేయటమే కాకుండా ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు మా తరం అయిపోతోంది.

భవిష్యత్తు తరాన్ని నడిపించేది యువతే కాబట్టి వారు బాధ్యత తీసుకోవాలన్నదే నా లక్ష్యం. నేటి యువత భవిష్యత్తు నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నా. యువత కోసం ఇంత ఆలోచించిన నేను లోకేశ్ యువగళం పాదయాత్ర అంటే ఓ తల్లిలా వద్దన్నది కూడా నేనే. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఎంతకైనా తెగించి వేధిస్తున్న తీరును చూసి లోకేశ్​ను యువగళం వద్దన్నా, ఓ సైనికుడిలా రాష్ట్ర ప్రజల అవసరం కోసం వెళ్లాలని ఆ తర్వాత ఆలోచించి ముందుకు పంపా. పార్టీకి కూడా లోకేశ్​ అవసరం ఉందని గుర్తించాను.

గౌరవ సభ తిరిగి ఏర్పడుతుంది: నా గురించి పూర్తిగా చంద్రబాబుకు తెలుసు కాబట్టే అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని భరించలేక బాధపడ్డారు. పవిత్రమైన అసెంబ్లీలో మహిళల్ని కించపరచటం అవసరమా అని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. ప్రజా సమస్యలు చర్చించి చట్టాలు చేయాల్సిన పవిత్ర సభలో మహిళల్ని కించపరిచారంటేనే వారెంత అవివేకులో అర్థమైంది. ప్రజలకు సంబంధించిన అసెంబ్లీలో మహిళల్ని హేళన చేయటమేంటని నాకూ బాధ అనిపించింది. నాన్న మొండితనం, ధైర్యం, క్రమశిక్షణే ఆ ఘటనను ఎదుర్కొని ముందుకెళ్లేలా చేసింది. చంద్రబాబు రిలీజ్ అవ్వటానికి నిజం గెలవాలి ముందుకు తీసుకెళ్లా. కానీ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయా. ప్రజలతోనే మమేకమైపోయా. ప్రజలకు అవసరమైనవే చేయాలని నిర్ణయించా అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.