TDP Celebrations in Andhra Pradesh: ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ విలవిల్లాడుతుండగా కూటమి ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కూటమి అభ్యర్థులు జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తున్న తరుణంలో జగన్ మినహా మంత్రులంతా ఓటమి బాటలో పయనిస్తున్నారు.
ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేస్తోంది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగుతోంది. కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా నడుస్తోంది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి దూసుకెళ్తోంది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాలోనూ సైకిల్ పరుగులు పెడుతోంది. ఒకరిద్దరు మినహా ఓటమి బాటలో మంత్రులు ఉన్నారు. పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని అంబటి, గుడివాడ అమర్నాథ్‌తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది.
టీడీపీ శ్రేణుల సంబరాలు: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కార్యాలయం గేటు ముందు టపాసులు కాల్చి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నివాసం వద్ద తెలుగుదేశం శ్రేణులు టపాసులు కాల్చారు. రెండు చోట్లా సంబరాలు అంబరాన్ని అంటాయి. కొడాలినాని కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు టీవీలో చూసి నాని ముఖంపై తెలుగుదేశం శ్రేణులు చెప్పులతో కొట్టారు.
ఏపీలో కూటమి సునామీ - వందకు పైస్థానాల్లో దూసుకుపోతున్న అభ్యర్థులు - AP Election Result